Shhyamali De: నిద్రలేని రాత్రులు గడుపుతున్నా.. నా బాధను అర్థం చేసుకోండి.. రాజ్ నిడుమోరు మాజీ భార్య పోస్ట్..

టాలీవుడ్ హీరోయిన్ సమంత రెండోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో డిసెంబర్ 1న ఏడడుగులు నడిచింది. వీరిద్దరి వివాహం కోయంబత్తూరులోని లింగ భైరవి ఆలయంలో నిరాడంబరంగా జరిగింది. గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో సమంత, రాజ్ పెళ్ళి వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Shhyamali De: నిద్రలేని రాత్రులు గడుపుతున్నా.. నా బాధను అర్థం చేసుకోండి.. రాజ్ నిడుమోరు మాజీ భార్య పోస్ట్..
Shyamali

Updated on: Dec 04, 2025 | 12:39 PM

టాలీవుడ్ హీరోయిన్ సమంత, రాజ్ నిడుమోరు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. డిసెంబర్ 1న వీరిద్దరి వివాహం కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లోని లింగ భైరవి ఆలయంలో అతికొద్ది బంధువులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. గత నాలుగు రోజులుగా వీరి పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే వీరి పెళ్లి రోజు నుంచి రాజ్ నిడుమోరు మాజీ భార్య శ్యామలీ దే ఇన్ స్టా పోస్టులు తెగ వైరలవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. తాను ఎవరి సానుభూతి కోసం పాకులాడం లేదని అన్నారు. తాను ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వనని పేర్కొన్నారు. తన నుంచి బ్రేకింగ్ న్యూస్ లు, ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలు ఆశించవద్దని అన్నారు.

ఇవి కూడా చదవండి :  Maheshwari : పెళ్లి సినిమా హీరోయిన్ గుర్తుందా.. ? ఆమె కూతురు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్..

సమంత, రాజ్ నిడిమోరు వివాహం చేసుకున్న తర్వాత అందరూ తనపై జాలి చూపిస్తున్నారని.. కానీ తాను ఏ విషయాన్ని పట్టించుకోవడం లేదని అన్నారు. “నా మీద ప్రేమాభిమానాలు చూపిస్తున్న అందరికీ కృతజ్ఞతలు. మీ అందరి ఆశీర్వాదాలు నాకు అందుతున్నాయి. ప్రస్తుతం ఎలాంటి విషయాల గురించి పట్టించుకునే పరిస్థితుల్లో లేను. ఎందుకంటే మా గురువు క్యాన్సర్ బారిన పడినట్లు ఇటీవల తెలిసింది. ఆయన కోసమే నేను ప్రార్థిస్తున్నాను. నాకు ఎలాంటి పీఆర్ టీమ్ లేదు. నా సోషల్ మీడియా ఖాతాలను నేను మెయిన్ టెన్ చేస్తాను. నేను మా గురువు గురించి ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నా. ఆ కారణంగా మీ అందరికీ స్పందించలేను. నా బాధను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నా నుంచి ఎలాంటి న్యూస్ లు ఆశించకండి. నాపై సానుభూతి చూపాల్సిన అవసరం లేదు. అందరూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను” అంటూ రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి : Actor : ఒకప్పుడు మామిడి కాయలు అమ్మాడు.. ఇండస్ట్రీలోనే టాప్ నటుడు.. ఒక్కో సినిమాకు కోట్ల రెమ్యునరేషన్..

ప్రస్తుతం శ్యామలీ దే పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి. రాజ్ నిడుమోరు 2015లో శ్యామలీని వివాహం చేసుకున్నారు. కానీ కొన్నాళ్లకే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి : Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. బ్రహ్మానందంపై అలాంటి మాటలా.. ?