టాలీవుడ్ లో రీసెంట్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమాల్లో సీతారామం(Sita Ramam)ఒకటి. మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హను రాఘవపూడి ఈ సినిమా దర్శకత్వం వహించాడు. అందమైన ప్రేమకథలను త్ తెరకెక్కించడంలో హను రాఘవపూడిది డిఫరెంట్ స్టైల్. యుద్ధంతో రాసిన ప్రేమ కథ అంటూ వచ్చిన సీతారామం సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో హను రాఘవపూడి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయ్యారు. స్టార్ హీరోలు కూడా హనుతో సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఇప్పుడు ఓ మల్టీస్టారర్ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. యంగ్ హీరోలు ఇద్దరితో ఓ అద్భుతమైన కథను తెరకెక్కించనున్నాడట హను. ఈ ఇద్దరూ హీరోలు ఎవరంటే..
టాలీవుడ్ టాలెంటెడ్ హీరోలు నాని, శర్వానంద్ తో హను రాఘవపూడి ఓ మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. గతంలో శర్వాతో కలిసి పడి పడిలేచే మనసు సినిమా చేశాడు. అలాగే నానితో ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ సినిమా చేశాడు. ఇప్పుడు ఈ ఇద్దరినీ కలిపి సినిమా చేస్తున్నాడు. ఇద్దరు స్నేహితుల మధ్య నడిచే కథగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాలో హీరోలు హిందూ ముస్లిం యువకులుగా కనిపించనున్నారట. ఈ మల్టీస్టారర్ మూవీని ఓ బడా నిర్మాణసంస్థ నిర్మిస్తుందని టాక్. సీతారామం సినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.