
దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోలు చెప్పే డైలాగులు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. అభిమానులు కూడా వీటిని తెగ ఇష్టపడుతుంటారు. అయితే రీల్ లైఫ్ లోనే కాదు నిజ జీవితంలోనూ పూరి జగన్నాథ్ నోటి నుంచే వచ్చే మాటలు కూడా బాగా పేలుతుంటాయి. అందుకే ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ ప్రారంభించిన ‘ పూరీ మ్యూజింగ్స్’ కు ఎంతో మంది ఫాలోవర్లు ఉన్నారు. మన జీవితానికి సంబంధించి అన్న రకాల అంశాలను తన దైన శైలిలో విశ్లేషిస్తుంటారు పూరి. తాజాగా తండ్రి గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. అదేంటో ఆయన మాటల్లోనే.. ‘నాన్న.. ఆల్వేస్ అండర్ రేటెడ్.. నాన్న మన కోసం ఏం చేశాడో మనకు తెలియదు. ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు. ఎందుకంటే.. నాన్న ఎప్పుడూ ఇవి చెప్పడు. ఎవరికీ చెప్పడు. పిల్లలకు, పెళ్లానికి అసలు చెప్పడు. అమ్మలా ప్రేమను ఎక్స్ ప్రెస్ చేయడం నాన్నకు రాదు. ఆయన ఎప్పుడో ఇంటికి వస్తాడు. ఎప్పుడో వెళ్లిపోతాడు. బిజీగా ఉన్న నాన్న అయితే రాత్రి పూట ఇంటికి వచ్చి మంచం మీద ఎదుగుతున్న పిల్లలను చూస్తుంటాడు. ఎప్పుడు పనేనా? కాస్త ఇంటి పట్టున ఉండొచ్చుగా అంటూ చిరాకు పడుతూ మాట్లాడుతున్న అమ్మ మాటలు వింటూనే ఉంటాం. పిల్లలు కూడా నాన్నను బాగా మిస్ అవుతుంటారు. నిజానికి నాన్నని నాన్ననే మిస్ అవుతుంటాడు’ అని తండ్రి గొప్పతనం గురించి అద్భుతంగా చెప్పుకొచ్చారు పూరి. ప్రస్తుతం ఈ పాడ్ కాస్ట్ నెట్టింట తెగ వైరలవుతోంది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు పూరి జగన్నాథ్. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. టబు, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు కన్నడ స్టార్ దునియా విజయ్ కుమార్, జరీనా వహాబ్, వి.టి.వి గణేష్, బ్రహ్మాజీ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జె.బి మోషన్ పిక్చర్స్ పతాకాలపై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, జె.బి నారాయణరావు కొండ్రొల్ల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.