AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puri Jagannadh: పూరి జగన్నాథ్‌కు హీరో దొరికేశాడు.. ఆ స్టార్ హీరోతో సినిమా చేస్తున్న డైనమిక్ డైరెక్టర్

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ మధ్యకాలంలో పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. చివరిగా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా కూడా బాక్దాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. దాంతో సినిమాలకు చిన్న బ్రేక్ తీసుకున్నారు.

Puri Jagannadh: పూరి జగన్నాథ్‌కు హీరో దొరికేశాడు.. ఆ స్టార్ హీరోతో సినిమా చేస్తున్న డైనమిక్ డైరెక్టర్
Puri Jagannath
Rajeev Rayala
|

Updated on: Mar 18, 2025 | 9:46 AM

Share

ప్రస్తుతం పూరిజగన్నాథ్‌కు బ్యాడ్ టైమ్ నడుస్తుంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. చివరిగా పూరి డైరెక్షన్ లో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. డైరెక్టర్ పూరిజగన్నాథ్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన ఏ హీరోతో సినిమా చేస్తున్నాడు అనేది ప్రేక్షకులకు అనవసరం.. డైరెక్టర్ పూరి అయితే చాలు. యూత్‌ను ఆకట్టుకునే కథలు, డైలాగ్స్ తో పూరి సినిమాలు చేస్తుంటారు. పూరి సినిమాలో హీరోల యాటిట్యూడ్ యూత్‌ను ఎక్కువగా ఆకట్టుకుంటుంటాయి. పూరి మార్క్ డైలాగ్స్ బయట ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఇక ఈ మధ్యకాలంలో పూరి తెరకెక్కించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి.

పూరి డైరెక్షన్ లో వచ్చిన లైగర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఆతర్వాత వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా అంతగా అంచనాలు అందుకోలేకపోయింది. దాంతో పూరి ప్రస్తుతం గ్యాప్ తీసుకున్నారు.అయితే పూరి నెక్ట్స్ ఏ హీరోతో సినిమా చేస్తారు అన్నది మాత్రం సాస్పెన్స్ గానే ఉంది. ఆ మధ్య అక్కినేని యంగ్ హీరో అఖిల్ తో పూరి సినిమా ఉంటుందని టాక్ వినిపించింది. అలాగే తమిళ్ హీరో సినిమా చేస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు పూరికి హీరో దొరికాడని తెలుస్తుంది.

పూరిజగన్నాథ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నారని తెలుస్తుంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇటీవలే మహారాజా సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. అలాగే విడుదల 2లోనూ నటించి మెప్పించారు. ఇప్పుడు పూరి డైరెక్షన్ లో విజయ్ సేతుపతి సినిమా చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇటీవలే విజయ్‌కి పూరి కథ వినిపించినట్టు తెలుస్తోంది. కథాచర్చలు కొలిక్కి వచ్చినట్టే అని, త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కడంపై క్లారిటీ రానుంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ. 2 వేలతో సిప్‌ను ప్రారంభిస్తే పదేళ్లలో లక్షలాది రూపాయల రాబడి!
రూ. 2 వేలతో సిప్‌ను ప్రారంభిస్తే పదేళ్లలో లక్షలాది రూపాయల రాబడి!
ట్రాఫిక్‌ పోలీసుల కొరడా.. 8 రోజుల్లో 21,713 కేసులు!
ట్రాఫిక్‌ పోలీసుల కొరడా.. 8 రోజుల్లో 21,713 కేసులు!
మరో 2 రోజుల్లో RRB లోకో పైలట్‌ రాత పరీక్షలు.. హాల్ టికెట్ లింక్
మరో 2 రోజుల్లో RRB లోకో పైలట్‌ రాత పరీక్షలు.. హాల్ టికెట్ లింక్
మారనున్న పాన్‌కార్డు నియమాలు.. వినియోగదారులకు ఎంతో ఉపశమనం!
మారనున్న పాన్‌కార్డు నియమాలు.. వినియోగదారులకు ఎంతో ఉపశమనం!
సచిన్ ఇంట పెళ్ళి వేడుక.. ప్రముఖులకు ఆహ్వానాలు!
సచిన్ ఇంట పెళ్ళి వేడుక.. ప్రముఖులకు ఆహ్వానాలు!
టీమిండియా రికార్డులను చెరిపేస్తూ నంబర్ 1 స్థానానికి దాయాది దేశం
టీమిండియా రికార్డులను చెరిపేస్తూ నంబర్ 1 స్థానానికి దాయాది దేశం
కన్నీళ్లు మిగిల్చిన చివరి మజిలీ.. బైక్‌పై 10 కిమీ మృతదేహం తరలింపు
కన్నీళ్లు మిగిల్చిన చివరి మజిలీ.. బైక్‌పై 10 కిమీ మృతదేహం తరలింపు
పశువులకు ఈగల బెడద నుంచి ఇలా రిలీఫ్ ఇవ్వండి...
పశువులకు ఈగల బెడద నుంచి ఇలా రిలీఫ్ ఇవ్వండి...
సల్మాన్‌తో ఉన్న ఈ పాప ఇప్పుడు స్టార్ హీరోయిన్.. గుర్తు పట్టారా?
సల్మాన్‌తో ఉన్న ఈ పాప ఇప్పుడు స్టార్ హీరోయిన్.. గుర్తు పట్టారా?
రైల్వే ట్రాక్స్‌పై FM పేరుతో తెల్లటి దిమ్మెలు ఎందుకు ఉంటాయి?
రైల్వే ట్రాక్స్‌పై FM పేరుతో తెల్లటి దిమ్మెలు ఎందుకు ఉంటాయి?