చనిపోయేముందు సౌందర్య ఫోన్ చేసి ఇంటికి రమ్మంది.. ఇప్పటికీ ఆమె రాసిచ్చిన పేపర్స్ నా దగ్గర ఉన్నాయి.. నందినీ రెడ్డి..

దర్శకురాలు నందిని రెడ్డి ఇటీవలే మా ఇంటి బంగారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దివంగత నటి సౌందర్యతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. ఆమె మరణానికి ముందు తన ఇంటికి ఆహ్వానించిన తీరును, చేతి రాత గుర్తులు ఇంకా ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. అలాగే, రమ్యకృష్ణతో తన స్నేహాన్ని, ఆమె నటన సామర్థ్యాన్ని వివరించారు. సినీ పరిశ్రమలో "లేడీ డైరెక్టర్" అనే పదానికి తన స్పందనను తెలియజేశారు.

చనిపోయేముందు సౌందర్య ఫోన్ చేసి ఇంటికి రమ్మంది.. ఇప్పటికీ ఆమె రాసిచ్చిన పేపర్స్ నా దగ్గర ఉన్నాయి.. నందినీ రెడ్డి..
Nandini Reddy, Soundarya

Updated on: Jun 27, 2026 | 7:47 PM

దర్శకురాలు నందిని రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలా మొదలైంది వంటి అందమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన ఆమె.. ఇటీవలే మా ఇంటి బంగారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, దివంగత నటి సౌందర్య, స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణలతో తనకున్న ఆత్మీయ అనుబంధం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. నందిని రెడ్డి సౌందర్యతో తనకున్న ప్రత్యేకమైన స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు. సౌందర్యకు పానీపూరి అంటే చాలా ఇష్టమని, తరచుగా తనను “నందు, పానీపూరి తెప్పించాను, వచ్చేసేయ్” అని పిలిచేవారని తెలిపారు. సౌందర్య మరణానికి ముందు డాలర్స్ కాలనీలో కొత్త ఇల్లు కట్టారని, అప్పుడు రాజస్థాన్‌లో షూటింగ్‌లో ఉన్న సౌందర్య, తిరిగి వచ్చేటప్పుడు తనను వయా బెంగుళూరు వచ్చి ఇల్లు చూపించాలని ఆహ్వానించారని నందిని రెడ్డి గుర్తుచేసుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Cinema: 5 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ మూవీ.. ఓటీటీలో గత్తరలేపుతుంది..

బెంగుళూరు వెళ్లి ఆమె ఇంట్లో ఒక రోజు బస చేశానని, సౌందర్య తన ఇంటిని గర్వంగా చూపించారని వివరించారు. ఈ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, సౌందర్య చేతి రాత నోట్స్ ఇప్పటికీ తన వద్ద భద్రంగా ఉన్నాయని, వాటిని ఒక నిధిలా దాచుకున్నానని నందిని తెలిపారు. సౌందర్య చనిపోయిన వార్తను రమ్యకృష్ణ తనకు ఫోన్ చేసి చెప్పారని, ఆ వార్త విని తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని నందిని రెడ్డి వెల్లడించారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఉదయ్ కిరణ్‏తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్.. ఎంతో నరకం అనుభవించాను.. టాలీవుడ్ హీరోయిన్..

రమ్యకృష్ణ గురించి మాట్లాడుతూ, ఆమె అత్యంత నిజాయితీ గల, బోల్డ్ వ్యక్తి అని నందిని రెడ్డి ప్రశంసించారు. ఆమె మనసులో ఏముంటే అదే మాట్లాడతారని, అబద్ధం అనేది ఆమె మనిషిలో ఉండదని, కల్మషం లేని వ్యక్తి అని అన్నారు. రమ్యకృష్ణ నటన సామర్థ్యం ఇంకా పూర్తిగా వెలికితీయబడలేదని, ఆమెకు సవాలుతో కూడిన పాత్రలు ఇస్తే అద్భుతంగా చేయగలరని నందిని గట్టిగా నమ్మకం వ్యక్తం చేశారు. బాహుబలిలోని శివగామి పాత్రలో ఆమె నటన అందరినీ షాక్ చేసిందని, ఆమె కళ్ళలో ఉండే పవర్‌ఫుల్‌ ఎక్స్‌ప్రెషన్స్‌కు అది నిదర్శనమని అన్నారు. రమ్యకృష్ణ ఒక అద్భుతమైన నటి మాత్రమే కాదని, అంతకు మించి ఒక గొప్ప వ్యక్తి అని నందిని పేర్కొన్నారు. అలా మొదలైంది సినిమాలో రమ్యకృష్ణను తీసుకోవాలని అడిగితే, బడ్జెట్ ఎక్కువ అవుతుందని చెప్పిన విషయాన్ని కూడా నందిని గుర్తుచేసుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : RRR Movie : అబ్బబ్బా.. ఏం మారింది భయ్యా.. ఆర్ఆర్ఆర్ సినిమా మల్లీని చూశారా.. ? అచ్చం హీరోయిన్‏లాగే ఉందిగా..

దర్శకత్వ ప్రస్థానంలో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నానని, “అలా మొదలైంది” సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన నాని తన మొదటి సినిమా హీరో అని నందిని రెడ్డి తెలిపారు. సినిమా రిలీజ్‌కు ముందు నాని తనకు అభినందనలు తెలియజేస్తూ మెసేజ్ చేశారని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్‏గా త్రిష.. వీడియోస్ ఇదిగో..

Follow Us