Yatra 2 Twitter Review: ‘యాత్ర 2’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే..

|

Feb 08, 2024 | 7:54 AM

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను ఆధారంగా తీసుకుని తెరకెక్కించిన ఈ మూవీలో వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ నటుడు జీవా.. వైఎస్ఆర్ పాత్రలో మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రాజకీయాలకు సంబంధించినది కాదని.. కేవలం ఒక తండ్రికి ఇచ్చిన మాట కోసం కొడుకు చేసిన పోరాటమే అని.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఓ కొడుకు కథే ఈ సినిమా అంటూ ముందు నుంచి చెప్పాడు డైరెక్టర్.

Yatra 2 Twitter Review: యాత్ర 2 ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే..
Yatra 2 movie twitter review
Follow us on

డైరెక్టర్ మహి వీ రాఘవ .. గతంలో యాత్ర సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా వచ్చిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ యాత్ర 2 రూపొందించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను ఆధారంగా తీసుకుని తెరకెక్కించిన ఈ మూవీలో వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ నటుడు జీవా.. వైఎస్ఆర్ పాత్రలో మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రాజకీయాలకు సంబంధించినది కాదని.. కేవలం ఒక తండ్రికి ఇచ్చిన మాట కోసం కొడుకు చేసిన పోరాటమే అని.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఓ కొడుకు కథే ఈ సినిమా అంటూ ముందు నుంచి చెప్పాడు డైరెక్టర్.ఈ సినిమా ఇప్పుడు అడియన్స్ ముందుకు వచ్చింది. ఫిబ్రవరి 8న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే ఒక్కరోజు ముందే ఈ మూవీ చూసిన వైఎస్ఆర్సీపీ నాయకులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమా మర్చిపోయిన ఎన్నో జ్ఞాపకాలను గుర్తుచేస్తుందని.. భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఇప్పటికే మూవీ చూసిన నెటిజన్స్ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఈ మూవీలో ప్రతి డైలాగ్ అదుర్స్ అని తెలుస్తోంది. ముఖ్యంగా శుభలేఖ సుధాకర్ చెప్పిన డైలాగ్ కు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయట. ‘పిల్లిని తీసుకెళ్లి అడవిలో వదిలినా అది పిల్లే సార్.. పులిని తీసుకొచ్చి బోనులో పెట్టినా అది పులే సార్’ అనే డైలాగ్ సినిమాకే హైలెట్ అంట. ప్రతి డైలాగ్ ఎంతో అద్భుతంగా రాసుకున్నాడని.. డైరెక్టర్ మహి వీ రాఘవ్ రైటింగ్ కు ఫిదా అవుతున్నారు. అలాగే ఈసినిమాలో జీవా, మమ్ముట్టి తమ పాత్రలకు ప్రాణం పోశారని.. సంతోష్ నారాయణ్ ఆర్ఆర్.. సినిమాలోని డైలాగ్స్ అతి పెద్ద బలం అని అంటున్నారు. ఇక చివరగా.. ముఖ్యమంత్రిగా సీఎం జగన్ చేసిన ప్రమాణ స్వీకారం సీన్ చూస్తే గూస్ బంప్స్ అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.