Lokesh Kanagaraj : ఆ హీరోతో సినిమా డిజాస్టర్ అయ్యింది.. దారుణంగా మాటలు అన్నారు.. లోకేష్ కనగరాజ్ ఎమోషనల్..

కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి చెప్పక్కర్లేదు. తక్కువ సమయంలోనే టాప్ సక్సెస్ ఫుల్ దర్శకుల ఖాతాలలో చేరిపోయారు. ఇప్పటివరకు ఐదు సినిమాలను తెరకెక్కించగా.. అందులో మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్ తన సినిమాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Lokesh Kanagaraj : ఆ హీరోతో సినిమా డిజాస్టర్ అయ్యింది.. దారుణంగా మాటలు అన్నారు.. లోకేష్ కనగరాజ్ ఎమోషనల్..
Lokesh Kanagaraj

Updated on: Dec 27, 2025 | 10:22 AM

తమిళ చిత్రపరిశ్రమలో సక్సెస్ ఫుల్ దర్శకులలో లోకేష్ కనగరాజ్ ఒకరు. స్టార్ హీరోలతో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ తెరకెక్కిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ దర్శకుడికి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు మొత్తం 5 సినిమాలను రూపొందించారు లోకేష్. అందులో మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. రెండు చిత్రాలు పర్వాలేదనిపించుకున్నాయి. తక్కువ సమయంలోనే కోలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్స్ లిస్టులోకి చేరిన లోకేష్.. ఇప్పుడు అటు దర్శకుడిగా.. ఇటు హీరోగా అలరించేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం డైరెక్టర్ లోకేష్ హీరోగా ఓ సినిమా రూపొందిస్తున్నారు. అయితే లోకేష్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సినిమా కూలీ. ఈ సంవత్సరం ఆగస్టులో విడుదలైన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. రజినీ, నాగార్జున కలిసి నటించిన ఈ మూవీ రజినీ అభిమానులను మెప్పించలేకపోయింది. అయితే ఈ మూవీ విడుదల సమయంలో వచ్చిన విమర్శలపై తాజాగా లోకేష్ స్పందించారు.

ఇవి కూడా చదవండి : Rajinikanth: రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది.. సంచలన కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్..

లోకేష్ మాట్లాడుతూ.. ” కూలీ సినిమా పై ఎన్నో విమర్శలు వచ్చాయి. నేను తర్వాత తీయనున్న మూవీలో వాటిని సరిదిద్ధుకునే ప్రయత్నం చేస్తాను.. నాపై ఎన్నో ట్రోల్స్ వచ్చినప్పటికీ.. జనాలు మాత్రం రజినీ కోసం సినిమా చూశారు. అప్పుడు ఆ సినిమాకు రూ.500 కోట్లు వచ్చాయని నిర్మాతలు చెప్పారు. అందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పాలి. నేను ఎప్పుడూ అంచనాల మీద కథలు రాయలేదు. కానీ రాసుకున్న కథలోని పాత్రలు అడియన్స్ అంచనాలను అందుకుంటే మాత్రం సంతోషిస్తాను. ఒకవేళ అలా అందుకోలేకపోతే తర్వాత సినిమా అయినా వాటి కోసం ట్రై చేస్తాను” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి : Vinay Rai: అప్పుడు హీరోగా.. ఇప్పుడు విలన్‏గా.. ఈ నటుడి ప్రియురాలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఎవరంటే.

ఇప్పటివరకు లోకేష్ తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. సూపర్ స్టా్ర్ రజినీకాంత్ హీరోగా లోకేష్ తెరకెక్కించిన సినిమా కూలీ. ఇందులో నాగార్జున, శ్రుతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర, అమీర్ ఖాన్ కీలకపాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా రజినీ తన మార్క్ అందించారు. ఈ మూవీ రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది.

ఇవి కూడా చదవండి : Folk Song : యూట్యూబ్‏లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..

ఇవి కూడా చదవండి :  The Paradise: కాంబో అదిరింది భయ్యా.. నానితో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. ది ప్యారడైజ్ నుంచి క్రేజీ అప్డేట్..