The Warriorr: కృతి శెట్టిపై డైరెక్టర్ లింగుస్వామి ఆసక్తికర కామెంట్స్.. తక్కువ అంచనా వేశానంటూ..

|

Jul 11, 2022 | 11:21 AM

ఈ క్రమంలో ది వారియర్ ప్రమోషన్లలో భాగంగా ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా డైరెక్టర్ లింగుస్వామి మాట్లాడుతూ.. బేబమ్మ గురించి తక్కువ అంచనా వేశానంటూ చెప్పుకొచ్చారు.

The Warriorr: కృతి శెట్టిపై డైరెక్టర్ లింగుస్వామి ఆసక్తికర కామెంట్స్.. తక్కువ అంచనా వేశానంటూ..
Krithi Shetty
Follow us on

ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ది వారియర్ (The Warriorr). తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. మొదటిసారి రామ్ పోలీస్ ఆఫీసర్‏గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరో ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న ఈ సినిమా జూలై 14న తెలుగు, తమిళ్ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ది వారియర్ ప్రమోషన్లలో భాగంగా ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా డైరెక్టర్ లింగుస్వామి మాట్లాడుతూ.. బేబమ్మ గురించి తక్కువ అంచనా వేశానంటూ చెప్పుకొచ్చారు.

డైరెక్టర్ లింగుస్వామి మాట్లాడుతూ.. ” డైరెక్టర్ చెప్పింది చేసే ఆర్టిస్ట్ హీరో దొరకడం నా అదృష్టం. డ్యాన్సులు, ఫైట్స్ అద్భుతంగా చేశారు. మా ఇద్దరికి పది సినిమాలు చేసే లింక్ కుదిరింది. ఇక కృతి శెట్టి గురించి తక్కువ అంచనా వేశాను. కానీ ఆమె ఇంతలా పర్ఫామెన్స్ చేయడంతో షాక్ అయ్యాను. ఆమె ఈమేనా ? అని ఆశ్చర్యపోయాను. బేబమ్మ సూపర్బ్. గత పది రోజులుగా డే అండ్ నైట్ పనిచేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్. ఆయనది. హీరోది సేమ్ ఎనర్జీ. ఇది నా మొదటి తెలుగు సినిమా. రన్, పందెంకోడి, ఆవారా సినిమాను చూసి ఉంటారు. ఇది నా కరెక్ట్ ఎంట్రీ మూవీ ” అంటూ చెప్పుకొచ్చారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.