కరోనాపై దర్శకుడు క్రిష్ షేర్ చేసిన‌ వేమన శతకం…

ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌పంచాన్ని అత‌లాకుతలం చేస్తోంది. అంద‌రూ ఈ వైర‌స్ నుంచి త‌మ‌ను త‌మ‌ను తాము కాపాడుకునే ప‌నిలో బిజీగా ఉన్నారు.

కరోనాపై దర్శకుడు క్రిష్ షేర్ చేసిన‌ వేమన శతకం...

Updated on: Jun 18, 2020 | 8:09 AM

ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌పంచాన్ని అత‌లాకుతలం చేస్తోంది. అంద‌రూ ఈ వైర‌స్ నుంచి త‌మ‌ను త‌మ‌ను తాము కాపాడుకునే ప‌నిలో బిజీగా ఉన్నారు. ఈ మ‌హ‌మ్మారికి ఇప్ప‌టివ‌రకు స‌రైన వ్యాక్సిన్ లేదా మెడిసిన్ అందుబాటులోకి రాలేదు. అయినా త‌ప్ప‌నిస‌రి పరిస్థితుల్లో ప్ర‌భుత్వాలు లాక్ డౌన్ నుంచి స‌డ‌లింపులు ఇచ్చాయి. దీంతో ఇండియాలో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఇక్క‌డ అంద‌రూ గుర్తుపెట్టుకోవాల్సిన విష‌యం ఒక‌టుంది. స‌డ‌లింపులు ఇచ్చింది ప్ర‌భుత్వం మాత్ర‌మే. క‌రోనావైర‌స్ కాదు.

ఈ నేప‌థ్యంలో ప‌లువురు సెల‌బ్రిటీలు క‌రోనా గురించి ప్ర‌జ‌ల‌కు జాగ్ర‌త్త‌లు చెబుతున్నారు. అశ్ర‌ద్ద వ‌హిస్తే మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిస్తారు. ఇందుకు ఒక్కొక్క‌రు ఒక్కో పంథా ఎన్నుకుంటున్నారు. ఈ క్ర‌మంలో క‌రోనావైర‌స్ పై ఎవ‌రో రాసిన ఓ వేమ‌న ప‌ద్యాన్ని డైరెక్ట‌ర్ క్రిష్ ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు. అది త‌మ సిద్దార్థ ఫార్మ‌శీ కాలేజీ వాట్సాఫ్ గ్రూఫులో వ‌చ్చింద‌ని..ఎవ‌రు రాశారో తెలియ‌ద‌ని చెప్పారు. ఆ ప‌ద్యం కాస్తా ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో తెగ వైర‌ల్ అవుతుంది. కాగా ప్ర‌స్తుతం క్రిష్‌.. పవర్​స్టార్ పవన్​కల్యాణ్​ 27వ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగ‌తి తెలిసిందే. చారిత్రక నేపథ్య కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది.