AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. రక్తం కారినా సరే నటిస్తూనే ఉండేవాడు.. డైరెక్టర్ కోడి రామకృష్ణ..

ఒకప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్ననో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ కోడి రామకృష్ణ. అమ్మోరు, అరుంధతి వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన.. గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఇండస్ట్రీలోని ఓ స్టార్ హీరో పై ఆయన ప్రశంసలు కురిపించారు.

Tollywood : అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. రక్తం కారినా సరే నటిస్తూనే ఉండేవాడు.. డైరెక్టర్ కోడి రామకృష్ణ..
Kodi Ramakrishna
Rajitha Chanti
|

Updated on: Jul 08, 2026 | 11:51 AM

Share

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ తెలుగు సినీ పరిశ్రమలోని దిగ్గజ నటుల నిబద్ధత, అంకితభావం గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. నందమూరి బాలకృష్ణ, కృష్ణ, చిరంజీవి, అక్కినేని నాగేశ్వరరావు, రాజశేఖర్ వంటి నటులు తమ పని పట్ల చూపిన పట్టుదల, వృత్తిపరమైన నిబద్ధత వల్లే తెలుగు సినీ పరిశ్రమకు అనేక విజయాలు లభించాయని ఆయన అన్నారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ అంకితభావం గురించి కోడి రామకృష్ణ ప్రత్యేకంగా మాట్లాడారు. బాలకృష్ణకు ఒక కథ నచ్చితే, ఆ పాత్రకు మరెవ్వరూ సరిపోరు అన్నంతగా తన్మయత్వంతో నటించేస్తారని ఆయన అన్నారు. బాలకృష్ణ పట్టుదల “భయంకరమైనది” అని రామకృష్ణ అన్నారు. ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, బాలకృష్ణ సెట్‌లో అందరితో స్నేహపూర్వకంగా, వినయంగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు.

బాలకృష్ణ అంకితభావానికి ఉదాహరణగా ఒక డాన్స్ షూటింగ్ సంఘటనను రామకృష్ణ వివరించారు. ఒకసారి విజయశాంతితో కలిసి ఒక డాన్స్ నర్సరీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు, ఒక ఫాస్ట్ డాన్స్ మూమెంట్ మధ్యలో బాలకృష్ణ కాలుకు తీవ్రమైన గాయమైంది. నర్సరీలో కట్ చేసిన చెట్ల మొద్దులు కింద ఉండేవి. డాన్స్ చేస్తుండగా, ఒక పదునైన మొద్దు బాలకృష్ణ కాలిలోకి గుచ్చుకుపోయింది. నొప్పి విపరీతంగా ఉన్నా, రక్తం కారుతున్నా, బాలకృష్ణ షూటింగ్ ఆపడానికి నిరాకరించారు. బాలకృష్ణ రాకపోవడంతో యూనిట్ సభ్యులు ఆందోళన చెందారు. ఆయనను చూసినప్పుడు, కాలిలో మొద్దు గుచ్చుకుపోయిందని, అది బయటకు రావట్లేదని అర్థమైంది. వెంటనే డాక్టర్లను పిలిచారు. వారు వచ్చి, కాలిలో గుచ్చుకున్న మొద్దును తీయడానికి ఆ చుట్టూ ఉన్న నేలను తవ్వి, మొద్దును బయటకు తీయాల్సి వచ్చింది. ఈ ప్రక్రియకు దాదాపు గంట సమయం పట్టింది. కాలు శుభ్రం చేయించుకున్న వెంటనే, బాలకృష్ణ “తరువాత షాట్ ఏంటి?” అని అడిగారు. తన కాలికి అయిన గాయాన్ని, నొప్పిని లెక్కచేయకుండా షూటింగ్ పూర్తి చేయాలన్న ఆయన పట్టుదల యూనిట్ సభ్యులందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇదేవిధంగా, సూపర్ స్టార్ కృష్ణ కూడా అటువంటి నిబద్ధతతోనే ఉండేవారని రామకృష్ణ గుర్తుచేసుకున్నారు. కృష్ణ సెట్‌లోకి వస్తే, సాయంత్రంలోగా అన్ని సీన్లు పూర్తి చేయాల్సిందేనని, ఆయన చాలా వేగంగా పనిని పూర్తి చేసేవారని చెప్పారు. అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి వంటి దిగ్గజ నటులు కూడా సినిమా పట్ల అత్యంత నిబద్ధతతో, నిబద్ధతతో ఉండేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం కోడి రామకృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: అన్నయ్య నాకోసం ఫ్యాన్స్ వస్తారా అని అడిగాడు.. ఇప్పుడు ఇండస్ట్రీకే మొగుడయ్యాడు.. మురళి మోహన్..

ఎక్కువ మంది చదివినవి : Cinema: ఫస్ట్ సినిమా చూసి ప్లాప్ అన్నారు.. కట్ చేస్తే.. 26 ఏళ్లుగా తగ్గని క్రేజ్.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతారు..

Follow Us