
దర్శకుడు, నటుడు దేవి ప్రసాద్ తన సినీ కెరీర్, విజయాలు, ఎదురైన సవాళ్లు, ముఖ్యంగా బాలకృష్ణతో తాను చేయాలనుకున్న సినిమా ఎందుకు ఆగిపోయిందనే విషయాలపై గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన మిస్టర్ పెళ్లికొడుకు సినిమా కథ సునీల్‌కు సరిపోదని ముందే నిర్మాత ఆర్‌బి చౌదరి సహా అందరికీ చెప్పానని దేవి ప్రసాద్ తెలిపారు. సునీల్ నవ్వించగలడు, మంచి డాన్స్‌లు చేయగలడు, ఉత్సాహంగా ఉండాలి కానీ ఆ చిత్రంలో అతని పాత్ర లవర్ బాయ్‌గా, సినిమా అంతా విచారంగా ఏడుస్తూ సాగుతుందని వివరించారు. సునీల్ బాగా చేయగలడని నిర్మాత నమ్మి సినిమా చేయించారని, కానీ అది విజయవంతం కాకపోవడంతో తనకు నాలుగు సంవత్సరాల గ్యాప్ వచ్చిందని, ఆ తర్వాత సినిమా చేయలేదని చెప్పారు.
ఇది చదవండి: ‘ఆ సాంగ్ వల్లే హీరోయిన్‌గా సినిమాలు మానేశా.!’
తన కెరీర్‌లో లేడీ బాబ్జీ, లీలా మహల్ సెంటర్, ఆడుతూ పాడుతూ లాంటి విజయాలు ఉన్నాయని, ఆరు, ఏడు సినిమాల్లో 50 శాతం హిట్ పర్సంటేజ్ కలిగి ఉన్నానని దేవి ప్రసాద్ పేర్కొన్నారు. ఇది ఒక దర్శకుడికి మంచి సంఖ్య అయినప్పటికీ, తాను అనుకున్నన్ని సినిమాలు ఎందుకు చేయలేకపోయానో వివరించారు. అలాగే బాలకృష్ణతో ఒక కథ ఓకే అయిందని, మూడు, నాలుగు మీటింగ్‌లు జరిగాయని చెప్పారు. అయితే, మిస్టర్ పెళ్లికొడుకు సినిమా విడుదలైన తర్వాత అది ఆడకపోవడంతో, నిర్మాతలు ఆ ప్రాజెక్ట్‌ను ప్రస్తుతానికి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఆ తర్వాత వారు వేరే డైరెక్టర్లతో ప్రయత్నాలు చేస్తున్నారని తనకు తెలిసిందని, తాను ఎవరిని అడగలేదని, బాలకృష్ణ కూడా ఆ విషయం ప్రస్తావించలేదని అన్నారు. అయితే, తాను నటుడిగా మారిన తర్వాత బాలకృష్ణ సినిమాలైన కథానాయకుడు, మహానాయకుడులో నటించినప్పుడు, ఆ సందర్భంలో గతంలో అనుకున్న సినిమా గురించి మాట్లాడుకున్నామని వెల్లడించారు.
సినిమా నిలిచిపోయినందుకు ఇచ్చిన అడ్వాన్స్‌ను తాను తిరిగి ఇచ్చేశానని చెప్పారు. ఈ అడ్వాన్స్ కారణంగా ఇతర సినిమాలు ఒప్పుకోకుండా, బాలకృష్ణ సినిమాపైనే తాను ఉన్నందున 100 శాతం నష్టపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, సినీ ఇండస్ట్రీలో ఇవన్నీ సహజమని, ప్రతి దర్శకుడికీ ఇలాంటివి జరుగుతాయని, ఇందులో ఎవరినీ తప్పుపట్టడానికి లేదని, ఒక సినిమా ఫ్లాప్ అయినప్పుడు మార్కెట్ పరిస్థితులు మారతాయని దేవి ప్రసాద్ వెల్లడించారు.
ఇది చదవండి: షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏమన్నారంటే.?
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..