Peddi Movie: పెద్ది పై అంచనాలు పెంచేసిన డైరెక్టర్.. రామ్ చరణ్ గురించి బుచ్చిబాబు ఏం చెప్పారంటే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది. తాజాగా మరోసారి పెద్దిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు డైరెక్టర్ బుచ్చిబాబు సన.

Peddi Movie: పెద్ది పై అంచనాలు పెంచేసిన డైరెక్టర్.. రామ్ చరణ్ గురించి బుచ్చిబాబు ఏం చెప్పారంటే..
Buchibabu, Peddi Movie

Updated on: May 15, 2025 | 6:27 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీస్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాది గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకులను ముందుకు వచ్చారు చరణ్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. కానీ సరికొత్త కథతో చరణ్ చేసిన ప్రయత్నంపై విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. ఈ మూవీ కలెక్టర్ పాత్రలో కనిపించిన చరణ్.. ఇప్పుడు పక్కా ఊర మాస్ కథతో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న పెద్ది చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. కొన్నాళ్ల క్రితం విడుదలైన పెద్ది గ్లింప్స్ తర్వాత ఒక్కసారిగా ఈ మూవీ గురించి ప్రేక్షకులలో మరింత ఆసక్తి నెలకొంది.

ఫస్ట్ గ్లింప్స్ లో చరణ్ లుక్స్, డైలాగ్స్, ఏఆర్ రెహామాన్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించాయి. దీంతో ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో తాజాగా పెద్ది సినిమాపై మరింత అంచనాలు పెంచేశాయి డైరెక్టర్ బుచ్చిబాబు సన. తాజాగా ఆయన ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. పెద్ది సినిమా పూర్తిగా ఎమోషనల్ రైడ్ అని.. ఈ మూవీ కథను చాలా సంవత్సరాలు కష్టపడి రాసుకున్నట్లు తెలిపారు. ఇదేమి పూర్తిగా స్పోర్ట్స్ డ్రామా కాదని.. కేవలం క్రికెట్ గురించి కాకుండా.. అది కేవలం నేపథ్యం అని,.. సినిమా పూర్తి కథ వేరే ఉంటుందని అన్నారు. పూర్తిగా ఉత్తరాంధ్ర నేపథ్యంలో.. విజయనగరం ఏరియాలో జరిగే ఈ కథను తెరపైకి తీసుకురావాలని చరణ్ సైతం ఎక్కువగానే కష్టపడుతున్నారని అన్నారు.

ఈ సినిమా కోసం చరణ్ ఎన్నో లుక్స్ ట్రై చేసి.. చివరకు ఫిజికల్ గా చాలా ట్రాన్స్ ఫర్మ్ అయ్యారని.. చరణ్ ఆఫ్ స్క్రీన్ క్యారెక్టర్ కు పెద్ది పాత్ర చాలా దగ్గరగా ఉంటుందని.. చిట్టిబాబు కథ రంగస్థలం అయితే.. పెద్ది కథ వేరేలా ఉంటుందని అన్నారు. దీంతో బుచ్చిబాబు చేసిన కామెంట్స్ తో పెద్ది సినిమాపై మరింత హైప్ నెలకొంది.

ఇవి కూడా చదవండి :  

 Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?

Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..