పాన్ ఇండియా సినిమాలు ఇప్పుడు దుమ్మురేపుతున్నాయి. అన్ని భాషల్లో రిలీజ్ అయ్యి సలాడ్ సక్సెస్ ను అందుకుంటున్నాయి సినిమాలు. దాంతో టాలెంట్ ఉన్న దర్శకులు హీరోలతో పని చేయడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు మన హీరోలు. ఇప్పటికే ఎన్టీఆర్ బాలీవుడ్ లో సినిమా చేస్తున్నారు. అలాగే తమిళ్ హీరోలు తెలుగు దర్శకులతో పని చేస్తున్నారు. అటు బాలీవుడ్ హీరోలు కూడా తెలుగు దర్శకుల వైపు చూస్తున్నారు. మొన్నే షారుఖ్ ఖాన్ తమిళ్ డైరెక్టర్ అట్లీ తో కలిసి జవాన్ తో సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఇంకా కలిసి మెలిసి ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని తెలుస్తోంది.
సౌత్ స్టార్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న అట్లీ రీసెంట్ గా కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమా చేశారు. ఈ సినిమాలో షారుఖ్ డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించారు. అలాగే ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటించగా.. నయనతార హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా దాదాపు వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు అట్లీ ఓ మల్టీస్టారర్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు.
దళపతి విజయ్, షారుఖ్ ఖాన్ తో ఓ మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించనున్నాడు అట్లీ. ఇప్పటికే ఈ సినిమా గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ మల్టీ స్టారర్ పై క్లారిటీ ఇచ్చాడు అట్లీ. సోమవారం రోజున ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అట్లీ విజయ్ , షారుక్ మల్టీస్టారర్ గురించి ప్రస్తావించాడు. అట్లీ మాట్లాడుతూ.. జవాన్ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతున్న సమయంలో విజయ్ అక్కడికి వచ్చారు. షారుక్ , విజయ్ చాలా సేపు మాట్లాడుకున్నారు. ఆతర్వాత షారుక్ మా ఇద్దరిని పెట్టి ఏదైనా సినిమా చేయాలంటే చెప్పు మేము చేస్తాం అన్నారు. విజయ్ కూడా దానికి ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఇద్దరి ఇమేజ్ కు తగ్గ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాను. బహుశా అదే నా నెక్స్ట్ సినిమా అవ్వొచ్చు అని అన్నారు అట్లీ. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.