నవీన్ పొలిశెట్టి హీలేరియస్ హిట్టుకు సీక్వెల్ రాబోతుందా ? ఇంతకీ దర్శకుడు ఏమన్నాడంటే..

|

Mar 19, 2021 | 3:40 PM

Jathi Rathnalu : ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘జాతిరత్నాలు’. అనుదీప్ కేవీ ఈ చిత్రానికి దర్శకత్వం అందించాడు.

నవీన్ పొలిశెట్టి హీలేరియస్ హిట్టుకు సీక్వెల్ రాబోతుందా ? ఇంతకీ దర్శకుడు ఏమన్నాడంటే..
Jathi Rathnalu
Follow us on

Jathi Rathnalu : ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘జాతిరత్నాలు’. అనుదీప్ కేవీ ఈ చిత్రానికి దర్శకత్వం అందించాడు. మహానటి ఫేం డైరెక్టర్ నాగ్ అశ్విన్.. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ఈ నిర్మించాడు. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‏గా తెలుగు తెరకు పరిచయమయింది.ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలకపాత్రలలో నటించారు. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ  మూవీ స్టోరీ విషయానికి వస్తే..  జోగిపేటలో ఉంటూ అల్లరి చిల్లరిగా తిరిగే ఈ ముగ్గురు.. జాబ్‌ కోసం హైదరాబాద్‌కు వచ్చి.. ఓ కేసులో ఇరుక్కోవడాన్ని… చాలా ఫన్నీగా.. చూపించిడు డైరెక్టర్‌ అనుదీప్. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్‏ను హైదరాబాద్‏లోని నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసారు.

ఇందులో చిత్రయూనిట్ హుషారుగా కనిపించారు. దర్శకుడు, హీరో హీరోయిన్ ఇతరులు చేసిన సందడి అందరి దృష్టిని ఆకర్షిచింది. ఈ సక్సెస్ మీట్‏లో దర్శకుడు అనుదీప్‏ను రాహుల్ రామకృష్ణ ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా అంటూ ప్రశ్నించాడు. అందుకు అనుదీప్ స్పందిస్తూ చేద్దాం తప్పకుండా చేద్దాం అన్నట్లుగా సమాధానం ఇచ్చాడు. అనుదీప్ ఇప్పటికే తన తదుపరి సినిమాను యాక్షన్ బ్యాక్ డ్రాప్‏లో మాస్ ఎంటర్ టైనర్‏గా రూపొందించబోతున్నట్లుగా తెలిపాడు. ఇక ఇటీవల అనుదీప్ ఉప్పెన ఫేం వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇదే కనుగా నిజమైతే.. తర్వలోనే అనుదీప్, వైష్ణవ్ తేజ్ కాంబినేషన్లో సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది.

Also Read:

Acharya Movie: ‘ఆచార్య’ సినిమా నిజంగా అలా ఉంటుందా ?.. అసలు విషయం బయట పెట్టిన మెగాస్టార్..

‘మోసగాళ్ళు’ ట్విట్టర్ రివ్యూ: మంచు విష్ణు ఈసారి గట్టిగానే ట్రైచేసాడా ? ‘మోసగాళ్లు’ బ్లాక్ బస్టర్ హిట్టు అంటూ టాక్..

Rashmi Goutham: వైరల్‏గా మారిన రష్మీ గౌతమ్ ఇన్‏స్టా పోస్ట్… అభిమానుల మధ్య మాటల యుద్ధం..