F3 Movie: ఆ విషయంలో ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పిన ఎఫ్ 3 టీం.. అందుకు ఆర్ఆర్ఆర్ ఊపిరి పోసిందంటూ డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెంట్స్..

|

May 30, 2022 | 11:33 AM

దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మించిన ఈ సినిమా మే 27న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.

F3 Movie: ఆ విషయంలో ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పిన ఎఫ్ 3 టీం.. అందుకు ఆర్ఆర్ఆర్ ఊపిరి పోసిందంటూ డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెంట్స్..
Anil Ravipudi
Follow us on

డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్ 3 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మించిన ఈ సినిమా మే 27న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా నటించగా.. సోనాల్ చౌహన్ కీలకపాత్రలో నటించింది. ఈ సినిమాను విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు.. అభిమానులకు ఎఫ్ 3 చిత్రయూనిట్ కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారంనాడు హైద‌రాబాద్‌ లోని థియేట‌ర్లో ప‌ర్య‌టించింది ఎఫ్3 చిత్రయూనిట్. వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, సునీల్‌ త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, రెండేళ్ళ‌నాడు ఎఫ్‌3 మొద‌లుపెట్టిన‌ప్పుడు థియేట‌ర్‌ లో అంద‌రూ పిల్ల‌ల‌తోస‌హా కుటుంబం న‌వ్వుతుంటే థియేట‌ర్‌ లో స్పీక‌ర్లు ద‌ద్ద‌రిల్లాల‌ని అనుకున్నాం. ఇప్పుడు అదే జ‌రిగింది. పాండ‌మిక్ వ‌చ్చాక అంద‌రూ థియేట‌ర్‌ కు దూర‌మ‌య్యాం. ఆర్‌.ఆర్‌.ఆర్‌. అందుకు ఊపిరిపోసింది. ఎఫ్‌3తో మ‌ర‌లా అంద‌రూ థియేట‌ర్‌ కు రావ‌డం చూస్తుంటే మాకు ఎన‌ర్జీ వ‌చ్చింది. వెంక‌టేష్‌, వ‌రుణ్ సంక్రాంతి అల్లుళ్ళ‌గా ఎఫ్‌2 తో మీ ముందుకు వ‌స్తే, స‌మ్మ‌ర్ సోగ్గాళ్ళుగా ఇప్పుడు ఎఫ్‌3 తో వ‌చ్చారు. మీరు హిట్ ఇచ్చారు. సినిమాను మ‌ళ్ళీ మ‌ళ్ళీ చూడండి కుటుంబంతో చూడండి. నేను టార్గెట్ చేసింది మిమ్మ‌ల్ని న‌వ్వించ‌డానికే. టార్గెట్ రీచ్ అయ్యాం. క‌లెక్ష‌న్ల ప‌రంగా చాలా హ్యాపీగా వున్నాం. దిల్‌రాజుగారు ఆ జోష్‌ తోనే అమెరికా వెళ్ళారు. ఈ వారంలో మ‌ర‌లా మేం మీ అంద‌రికీ క‌లుస్తాం అని అన్నారు.

ఇవి కూడా చదవండి

సునీల్ మాట్లాడుతూ, నేను చాలా రోజుల త‌ర్వాత ఎఫ్‌3లో ఇలా క‌న‌బ‌డ్డాను. అనిల్‌ గారు నాకు అవ‌కాశం ఇచ్చారు. మీరంద‌రూ కుటుంబంలో ప్ర‌తి వారికి చెప్పండి. మ‌రోసారి క‌రోనా వేవ్ రాకుముందే అంద‌రూ సినిమా చూడండి అంటూ పేర్కొన్నారు.