
మాస్ మహారాజ రవితేజ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్స్ మాత్రం పడటం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగిన వాళ్లలో మాస్ మహారాజా రవితేజ ఒకడు. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు పోషించిన అతను ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమాతో హీరోగా సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఇడియట్, అమ్మానాన్నో తమిళ అమ్మాయి, ఖడ్గం, వెంకీ, భద్ర, విక్రమార్కుడు, కిక్ , శంభో శివ శంభో, బలుపు, పవర్, రాజా ది గ్రేట్ , క్రాక్ , వాల్తేర్ వీరయ్య లాంటి ఎన్నోబ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించాడు. తన ఎనర్జిటిక్ యాక్టింగ్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.
చివరిగా మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మాస్ జాతర సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. దాంతో మరోసారి రవితేజ అభిమానులు నిరాశపడ్డారు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తిరుమల కిషోర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు రవితేజ. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు.
భర్త మహాశయములకు విజ్ఞప్తి అనే ఆసక్తికర టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా ఆశికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తున్నారు. గతంలో దింపు హయతి రవితేజతో కలిసి ఇప్పటికే ఖిలాడీ సినిమాలో నటించింది. ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు మరోసారి డింపుల్ హయతి, రవితేజ కలిసి నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.