చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ తాజాగా ‘నాంది’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పటివరకు కేవలం కామెడీ సినిమాలు చేస్తూ వచ్చిన నరేష్.. నాంది సినిమాతో విభిన్న పాత్రలో నటించి.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత నరేష్ హిట్ అందుకున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ సాధించడంతో మేకర్స్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన దిల్ రాజు వేదికపైనే నరేష్‌కు లక్కీ ఛాన్స్ ఇచ్చారు.
నాంది సినిమా సక్సెస్ మీట్‌కు హజరయిన నిర్మాత దిల్ రాజు వేదికపై అల్లరి నరేష్‌ను ప్రశంసలతో ముంచేత్తారు. ఈ సందర్భంగా నరేష్ ను మెచ్చుకుంటూ.. ఆయనతో సినిమా నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ చెప్పుకోచ్చాడు. సరైన కథ, దర్శకుడితో నరేష్ తనను అడిగితే వెంటనే సినిమాను ప్రారంభిస్తానని అన్నారు. వీరిద్దరీ కాంబోలో ఎలాంటి సినిమా రాబోతుందని ఇప్పటినుంచే ప్రేక్షకులు అంచనాలు వేస్తున్నారు. ఇదిలా ఉంటే నాంది సినిమా విజయ్ కనకమేడల దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు.
Also Read: