కార్తీ ‘సుల్తాన్’ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్న వరంగల్ శ్రీను.. ఎంతో తెలుసా..

తమిళ స్టార్ హీరో కార్తీకి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళంలో తెరకెక్కిన ఆయన సినిమాలో తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి.

  • Rajitha Chanti
  • Publish Date - 12:33 pm, Wed, 24 February 21
కార్తీ 'సుల్తాన్' సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్న వరంగల్ శ్రీను.. ఎంతో తెలుసా..

తమిళ స్టార్ హీరో కార్తీకి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళంలో తెరకెక్కిన ఆయన సినిమాలో తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి. ఆవారా, నా పేరు శివ, ఖాకీ, ఊపిరి, ఖైదీ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కార్తీ. ప్రస్తుతం కార్తీ సుల్తాన్ సినిమా చేస్తున్నాడు. రెమో ఫేం భ్యాగ్యరాజ్ కన్నన్ ఈ సినిమాను భారీ బడ్జెట్‏తో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి. తాజాగా ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను వరంగల్ శ్రీను సొంతం చేసుకున్నాడట.

ఇటీవల విడుదలైన రవితేజ క్రాక్ సినిమాను నైజాంలో విడుదల చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న వరంగల్ శ్రీను ఫుల్ జోష్ మీదున్నాడు. ఆ సినిమా తర్వాత.. విశాల్ చక్ర, నాంది సినిమాలను విడుదల చేసి విజయం సాధించాడు. ప్రస్తుతం వరంగల్ శ్రీను నితిన్ చెక్ సినిమాను కొనుగోలు చేశారు. వీటితోపాటు విరాటపర్వం, టక్ జగదీష్, పుష్ప హక్కులను కూడా తీసుకునే ఆలోచనలో ఉన్నాడట శ్రీను. తాజా సమాచారం ప్రకారం కార్తీ సుల్తాన్ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను శ్రీను రూ.7 కోట్లపైగా చెల్లించి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో కార్తీకి జోడీగా రష్మిక మందన నటిస్తుంది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఎస్.ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఏప్రిల్ 2న విడుదల కానుంది.

Also Read:

శ్రీదేవి వర్ధంతి: అనంత లోకాలకు అతిలోక సుందరి.. నేటికి మూడేళ్ళు పూర్తి.. ‘దేవత’ జ్ఞాపకాలతో స్పెషల్ స్టోరీ..