Dil Raju: వారసుడు సక్సెస్ పార్టీ.. రంజితమే పాటకు దిల్‌ రాజు మనవరాలి స్టెప్పులు.. ఫిదా అయిన హీరో విజయ్

దిల్‌ రాజు మనవరాలు ఇషిత పార్టీలో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. వారసుడులోని చార్ట్‌ బస్టర్‌ సాంగ్‌ రంజితమే సాంగ్‌కు హుషారుగా స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకుందీ స్టార్‌ కిడ్‌. తన హుషారైన డ్యాన్స్‌కు మురిసిపోయిన హీరో విజయ్‌ చిన్నారిని ఎత్తుకుని అభినందించారు.

Dil Raju: వారసుడు సక్సెస్ పార్టీ.. రంజితమే పాటకు దిల్‌ రాజు మనవరాలి స్టెప్పులు.. ఫిదా అయిన హీరో విజయ్
Varasudu Success Party

Updated on: Jan 23, 2023 | 6:10 AM

కోలీవుడ్ స్టార్‌ దళపతి విజయ్‌ నటించిన తాజా చిత్రం వారసుడు(తమిళ్‌లో వారిసు). రష్మిక మందన్నా హీరోయిన్‌. వంశీపైడిపల్లి దర్శకత్వం వహించగా.. దిల్‌ రాజు బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ బ్లాక్‌ బస్టర్‌ తెలుగు, తమిళ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన వారసుడు సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌ రాజు తన ఇంట్లోనే సక్సెస్‌ పార్టీ ఏర్పాటు చేశాడు. తెలుగు వెర్షన్‌ ప్రమోషన్లలో పెద్దగా కనిపించని విజయ్‌ ఈ పార్టీ కోసం చెన్నై నుంచి హైదరాబాద్‌ వచ్చాడు. అతనితో పాటు వారసుడు మూవీ యూనిట్‌ అంతా ఈ పార్టీలో సందడి చేశారు. అయితే రష్మిక మాత్రం మిస్ అయ్యింది. దిల్‌రాజు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ఈవెంట్లో సందడి చేశారు. ఇక దిల్‌ రాజు మనవరాలు ఇషిత పార్టీలో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. వారసుడులోని చార్ట్‌ బస్టర్‌ సాంగ్‌ రంజితమే సాంగ్‌కు హుషారుగా స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకుందీ స్టార్‌ కిడ్‌. తన హుషారైన డ్యాన్స్‌కు మురిసిపోయిన హీరో విజయ్‌ చిన్నారిని ఎత్తుకుని అభినందించారు.

వారసుడు సక్సెస్‌ పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. కాగా ఈ పార్టీలో సరికొత్త లుక్‌తో కనిపించాడు విజయ్‌. దీంతో హీరో అభిమానులందరు ఫొటోలను షేర్ చేయడం మొదలుపెట్టారు. లోకేశ్ సినిమా కోసమే ఈ లుక్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఖైదీ, మాస్టర్‌, విక్రమ్‌ సినిమాలతో స్టార్‌ డైరెక్టర్‌గా మారిపోయిన లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలోనే తన కొత్త సినిమా చేస్తున్నాడు విజయ్‌. దళపతి 67 (వర్కింగ్‌ టైటిల్‌) ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..