Tollywood: 4తోనే చదువుకు కటీఫ్.. కట్ చేస్తే 450 సినిమాలతో సంచలనం.. చివరకు 35 ఏళ్ల వయసులోనే..

సినిమా సెలబ్రిటీల్లో చాలా మంది ఉన్నత విద్యా వంతులే. అయితే కొంత మంది మాత్రం చిన్న వయసులోనే వివిధ కారణాలతో చదువుకు దూరమయ్యారు. అయితేనేం తమ కష్టం, ప్రతిభతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ టాలీవుడ్ హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది.

Tollywood: 4తోనే చదువుకు కటీఫ్.. కట్ చేస్తే 450 సినిమాలతో సంచలనం.. చివరకు 35 ఏళ్ల వయసులోనే..
Tollywood Actress

Updated on: Sep 10, 2025 | 9:41 PM

హీరోలతో పోల్చుకుంటే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. వరుసగా రెండు, మూడు ఫ్లాప్ లు పడితే చాలు అవకాశాలు కరువైపోతాయి. ఇక హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే కూడా సినిమా అవకాశాలు తగ్గుతాయన్న అభిప్రాయమూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ వందల కొద్దీ సినిమాలు చేసిన అందాల తారలు చాలా మందే ఉన్నారు. ఈ టాలీవుడ్ నటి కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఏపీలోని ఓ పేద కుటుంబంలో ఈ ముద్దుగుమ్మ జన్మించింది. ఆర్థిక ఇబ్బందులతో నాలుగో తరగతితోనే చదువు మానేసింది. ఆ తర్వాత తల్లిదండ్రులు 14వ ఏటనే బలవంతంగా పెళ్లి చేశారు. చిన్నతనంలోనే భర్త హింస తట్టుకోలేక వదిలేసింది. ఆ తర్వాత చెన్నై వెళ్లింది. సినిమా అవకాశాల కోసం కాళ్లరిగేలా తిరిగింది. పొట్ట కూటి కోసం మేకప్ ఆర్టిస్ట్‌గా పని చేసింది. అలా తనకున్న పరిచయాలతోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కట్ చేస్తే.. సినిమా కెరీర్‌లో మొత్తం 450కి పైగా సినిమాల్లో నటించి సంచలనం సృష్టించింది. దక్షిణాదిన అన్ని భాషల్లోనూ నటించిన ఈ అందాల తార స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. తన అందం, అభినయంతో కుర్రకారుకు ఫేవరెట్ గా మారిపోయింది. తన డిమాండ్, క్రేజ్ కు తగ్గట్టుగానే లక్షల్లో రెమ్యునరేషన్ అందుకుంది. ఒకానొక దశలో దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

సినిమాల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల తార వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ప్రేమలో వైఫల్యం, ఇతరులు చేసిన మోసాలతో బాగా కుంగిపోయింది. స్టార్ నటిగా గుర్తింపు ఉన్నా ఇండస్ట్రీలో ఒంటరిగా మిగిలిపోయింది. చివరకు తన ఇంట్లోనే అనుమానాస్పద రీతిలో కన్నుమూసింది. అప్పటికాంకా ఆమె వయసు కేవలం 35 ఏళ్లే. ఈ నటిది ఆత్మహత్య చేసుకుందని ప్రచారంలో ఉన్నా అందులో ఎంత నిజమెంతో ఎవరికీ తెలియదు. ఇప్పటికీ ఈ అందాల తార చావు మిస్టరీనే. మరి ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగి 35 ఏళ్లకే తనువు చాలించిన ఆ అందాల తార మరెవరో కాదు 80-90 ల్లో స్పెషల్ సాంగ్స్ తో ఆడియెన్స్ ను ఉర్రూత లూగించిన సిల్క్ స్మిత.

హీరోయిన్‌గా నటించకపోయినా అంతకు మించి ఫాలోయింగ్ తెచ్చుకుంది సిల్క్ స్మిత. గ్లామర్ రోల్స్, బోల్డ్ సీన్లు, స్పెషల్ సాంగ్స్‌లో నటిస్తూ దక్షిణాదిన స్టార్ యాక్ట్రెస్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ స్టార్ డమ్ ను అలాగే కొనసాగించడంలో విఫలమైంది. వరుసగా లవ్ ఫెయి ల్యూర్స్, ఆర్థిక మోసాలు ఆమెను బాగా కుంగదీశాయి. చివరకు 1996 సెప్టెంబర్ 23న చెన్నైలోని సొంత ఇంట్లోనే శవమై కనిపించిందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

 

Silk Smitha

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి