
నటుడు చంద్రశేఖర్.. ఈ పేరు పెద్దగా ఎవ్వరికి తెలియక పోవచ్చు కానీ.. ఛత్రపతి శేఖర్ అంటే టక్కున అందరూ గుర్తుపట్టేస్తారు. ప్రభాస్ హీరోగా నటించిన ఛత్రపతి సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించి మెప్పించారు చంద్రశేఖర్ శేఖర్. అంతకు ముందు ఆయన పలు సీరియల్స్‌లోనూ నటించాడు. ఇక ఛత్రపతి సినిమా ఆయన మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అంతకు ముందు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్.. సింహాద్రి, సై సినిమాల్లో నటించాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నింటిలో దాదాపు ఈయన ఉంటారు. అయితే చంద్రశేఖర్ ఫ్యామిలి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. శేఖర్ ఫ్యామిలితో కలిసి కనిపించిన సందర్భాలు కూడా తక్కువే.. చంద్రశేఖర్ ఫ్యామిలి గురించి చాలా మందికి తెలియదు. ఆయన సతీమణి కూడా టాలీవుడ్ కు చెందిన వారే.
ఆమె కూడా ఓ నటి. చాలా సినిమాల్లో కనిపించి మెప్పించారు. ఆమె పేరు నీల్య భవాని. ఈమె కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి ప్రేక్షకులను అలరించారు. అలాగే పలు సీరియల్స్ లోనూ నటించి మెప్పించారు నీల్య భవాని. ఛత్రపతి శేఖర్, నీల్య భవాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ళు సాఫీగా సాగింది వీరి సంసారం జీవితం. ఆతర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఇప్పుడు విడి విడిగా జీవిస్తున్నారు.
చాలా మందికి నీల్య భవాని పేరు తెలియదు కానీ ఆమెను చూస్తే గుర్తుపడతారు. పండగ చేస్కో, కిక్ 2 , సైరా, నాని జెంటిల్ మ్యాన్‌లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమె స్వస్థలం ఖమ్మం. నీల్య భవాని సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు. ఆమె ఫేస్ బుక్ లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హీరోయిన్ లాంటి అందంతో ఉన్న ఆమె ఫోటోలు నెటిజన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.