
అతడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన మరో సినిమా ఖలేజా. 2010లో భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. అయితే ఈ చిత్రానికి సెఫరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అంతేకాదు టీవీల్లోకి యూట్యూబ్ లోకి వచ్చిన తర్వాత ఈ సినిమాను ఎగబడి చూశారు. అరె.. ఎంత మంచి సినిమాను ఎందుకు ఫ్లాప్ చేశామా? అని బాధపడిన వారు కూడా చాలా మంది ఉన్నారు. ఖలేజా సినిమాలో మహేష్ సరసన స్వీటీ అనుష్కా శెట్టి హీరోయిన్ గా నటించింది. అలాగే ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, అలీ, సునిల్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. కాగా ఇప్పుడీ ఖలేజా సినిమా సుమారు 15 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలో రిలీజ్ అయ్యింది. శుక్రవారం (మే30) నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో మహేష్ సినిమా సందడి చేయనుంది. ఇప్పటికే రీరిలీజ్‌పై ప్రీ సేల్స్ అంశంలో ఖలేజా సినిమా సరికొత్త బెంచ్‌మార్క్ నమోదు చేసింది. ఈ సందర్భంగా ఖలేజా సినిమా గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే..
ఖలేజా సినిమాలో హీరోయిన్ గా మొదట పార్వతీ మెల్టన్ ను తీసుకున్నార ట మేకర్స్. అంతకు ముందు త్రివిక్రమ్ తెరకెక్కించిన జల్సా సినిమాలోనూ పార్వతి సెకెండ్ హీరోయిన్ గా నటించింది. అయితే ఖలేజా సినిమా కోసం ఆమెనే మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నారట. కొంత భాగం ఆమెతో షూటింగ్ కూడా జరిపారట. అయితే ఎందుకోగానీ ఆ తర్వాత పార్వతి మెల్టన్ సినిమా నుంచి తప్పుకుందట. దీంతో అనుష్కను హీరోయిన్ గా తీసుకున్నారట మేకర్స్.
ఇదే కాదు మొదట ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ ను అనుకున్నారట. కానీ చివరకు మణిశర్మ లైన్ లోకి వచ్చారు.
This is PEAK CRAZY!❤️🔥
Khaleja 4K creates history as the FIRST Re-release to Gross ₹6 crore in pre-sales Worldwide, including offline fan shows!🔥🔥@urstrulyMahesh #Khaleja4K#Khaleja4KFromMay30 pic.twitter.com/cZn3ZXjzpm
— Khaleja4K (@KhalejaTheFilm) May 29, 2025
Tollywood: 17 ఏళ్లకే సినిమాల్లోకి.. బిగ్ బాస్‌తో ఎనలేని క్రేజ్.. ఈ విజయవాడ బ్యూటీని గుర్తు పట్టారా?
Tollywood: ఏంటమ్మా ఇది! వోడ్కాకు బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. నెటిజన్ల ఆగ్రహం
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.