Nawazuddin Siddiqui: ఒకప్పుడు వాచ్‌మెన్.. ఇప్పటి బాలీవుడ్‌ ఫెమస్ యాక్టర్..

చాల మంది ఇండస్ట్రీలోకి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని వచ్చి సక్సెస్ అయ్యారు. అలాగే  బాలీవుడ్‌లో ఓ నటుడు ఉన్నాడు. అతని కుటుంబానికి బాలీవుడ్‌తో ఎలాంటి సంబంధం లేదు. సాధారణ కుటుంబంలో పుట్టిన ఈ వ్యక్తి కల చాలా పెద్దది. సినిమాల్లోకి రాక ముందు . అతను ఒక పూట భోజనం కోసం, తన కుటుంబాన్ని పోషించడం కోసం రకరకాల  ఉద్యోగాలు చేశాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ నటుడి ఆత్మవిశ్వాసం అతడిని విజయ శిఖరాలను అధిరోహించేలా చేసింది.

Nawazuddin Siddiqui: ఒకప్పుడు వాచ్‌మెన్.. ఇప్పటి బాలీవుడ్‌ ఫెమస్ యాక్టర్..
Nawazuddin Siddiqui

Updated on: Nov 18, 2023 | 11:54 AM

సినిమా ఇండస్ట్రీ ఎంతో మందికి  జీవితాన్ని ఇచ్చింది. సినిమా ఇండస్ట్రీలోకి రావడం ఎంత కష్టమో.. తేడాకొట్టి అదృష్టం కలిసి రాకపోతే ఇండస్ట్రీ నుంచి కనుమరుగవడం అంత సులభం. చాల మంది ఇండస్ట్రీలోకి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని వచ్చి సక్సెస్ అయ్యారు. అలాగే  బాలీవుడ్‌లో ఓ నటుడు ఉన్నాడు. అతని కుటుంబానికి బాలీవుడ్‌తో ఎలాంటి సంబంధం లేదు. సాధారణ కుటుంబంలో పుట్టిన ఈ వ్యక్తి కల చాలా పెద్దది. సినిమాల్లోకి రాక ముందు . అతను ఒక పూట భోజనం కోసం, తన కుటుంబాన్ని పోషించడం కోసం రకరకాల  ఉద్యోగాలు చేశాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ నటుడి ఆత్మవిశ్వాసం అతడిని విజయ శిఖరాలను అధిరోహించేలా చేసింది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఈ వ్యక్తి ఇప్పుడు బాలీవుడ్ అత్యుత్తమ నటుల జాబితాలో చోటు దక్కించుకున్నాడు . అతను మరెవరో కాదు నవాజుద్దీన్ సిద్ధిఖీ .

నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రముఖ నటుడని చాలా మందికి తెలుసు. అయితే నవాజుద్దీన్ సిద్ధిఖీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టక ముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. పూటగడవడానికి పడరాని కష్టాలు పడ్డాడు. వాచ్‌మెన్‌గా కూడా పని చేశారు  అభిమానులు ఈ విషయాన్ని తరచుగా గుర్తు చేసుకుంటారు. ఈ విషయాన్ని ఆయన కొన్ని ఇంటర్వ్యూల్లో కుడా ప్రస్తావించారు.

నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించి అభిమానులను అలరించాడు. ప్రతి సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ పాత్రకు ప్రశంసలు దక్కాయి. నవాజుద్దీన్ ఒకే రకమైన పాత్రకు కట్టుబడి ఉండరు. ‘సేక్రెడ్ గేమ్స్’ అనే వెబ్ సిరీస్‌లో గణేష్ గైతోండే పాత్రను పోషించి భేష్ అనిపించదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే నవాజుద్దీన్ సిద్ధిఖీ సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. అతను తన టాలెంట్ తో ఎంతో ఎత్తుకు ఎదిగాడు.

నవాజుద్దీన్ 1999లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ‘సర్ఫరోష్’ అతని మొదటి సినిమా. నవాజుద్దీన్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేటికి 24 ఏళ్లు. ఒక డైలాగ్‌కి, క్యారెక్టర్‌కి ప్రాణం పోయడానికి నవాజుద్దీన్ సిద్ధిఖీ ఓ మంచి ఉదాహరణ. ప్రస్తుతం అతడి చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. నవాజుద్దీన్ తన వ్యక్తిగత జీవితం కారణంగా ఇటీవల వార్తల్లో కూడా నిలిచాడు. తనను వేధిస్తున్నాడని అతని భార్య కేసు పెట్టింది. నవాజుద్దీన్ సిద్ధిఖీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.