Manchu Manoj-Ram Charan: మంచు మనోజ్ వద్దన్నాడు.. కట్ చేస్తే.. అదే కథతో రామ్ చరణ్ సూపర్ హిట్.. ఏ మూవీనో తెలుసా?

టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత 'భైరవం'తో రీఎంట్రీ ఇచ్చాడు. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ మరో రెండు ప్రధాన పాత్రల్లో కనిపించారు. మే30న విడుదలైన ఈ మల్టీ స్టారర్ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది.

Manchu Manoj-Ram Charan: మంచు మనోజ్ వద్దన్నాడు.. కట్ చేస్తే.. అదే కథతో రామ్ చరణ్ సూపర్ హిట్.. ఏ మూవీనో తెలుసా?
Manchu Manoj, Ram Charan

Updated on: Jun 03, 2025 | 4:47 PM

సుమారు ఎనిమిదేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించాడు రాక్ స్టార్ మంచు మనోజ్. విజయ్ కనకమేడల దర్శకత్వంలో అతను నటించిన తాజా చిత్రం భైరవం. మనోజ్ తో పాటు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ఈ సినిమాలో హీరోలుగా కనిపించారు. మే 30న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. ఇందులో మంచు మనోజ్ పోషించిన గజపతి పాత్రకు కూడా ఆడియెన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. చాలా రోజుల తర్వాత మంచు మనోజ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించాడని, గజపతిగా మంచు వారబ్బాయి అదరగొట్టాడని, అతని స్క్రీన్ ప్రజెన్స్ సూపర్బ్ గా ఉందని ప్రశంసలు వస్తున్నాయి. భైరవంతో మంచు మనోజ్ సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కాగా భైరవం సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు మనోజ్. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇదే క్రమంలో తన సినిమా కెరీర్ లో ఇప్పటివరకూ వదలుకున్న బ్లాక్ బస్టర్ సినిమాల గురించి వెల్లడించాడు.

”రచ్చ సినిమా ముందుగా నా వద్దకు వచ్చింది. కానీ డేట్స్ సర్దుబాటు చేయలేక వద్దన్నాను. అయితే ఆ తర్వాత నా ఫ్రెండ్ రామ్ చరణ్ ఆ సినిమా చేసినందుకు చాలా హ్యాపీ. అది చాలా పెద్ద హిట్టయింది. అలానే ‘ఆటోనగర్ సూర్య’ సినిమా వదులుకున్నా. అది నాగచైతన్య దగ్గరకు వెళ్ళింది. ‘అర్జున్ రెడ్డి’ మూవీ కూడా ముందు నాకే వచ్చింది. ‘పోటుగాడు’ టైంలో కొన్ని రోజులు ట్రావెల్ కూడా చేసాం. కానీ కొన్ని కారణాల వల్ల వదులుకోవాల్సి వచ్చింది. మంచి దర్శకులతో వర్క్ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్నా. ఒకటి పోతే ఇంకొకటి వస్తుందని నేను నమ్ముతున్నా. త్వరలో అలాంటి ఆఫర్స్ ఏమైనా వస్తాయేమో చూడాలి’ అని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.

ఏదేమైనా మంచు మనోజ్ అర్జున్ రెడ్డి, రచ్చ, ఆటోనగర్ సూర్య సినిమాలను రిజెక్ట్ చేసాడని తెలిసి అతని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఈ సినిమాలు చేసుంటే తమ అభిమాన హీరో కెరీర్ మరోలా ఉండేదేమోనని అభిప్రాయ పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

Racha Movie

ఇవి కూడా చదవండి..

Tollywood: ‘ఆర్మీ ట్రైనింగ్‌ను, క్రికెట్‌ను మధ్యలో వదిలేశాను’.. పశ్చాత్తాపపడుతోన్న టాలీవుడ్ యాంకర్.. ఎవరంటే?

Tollywood: ఒకప్పుడు బార్ ముందు మంచింగ్ ఐటమ్స్ అమ్మాడు.. కట్ చేస్తే 800 కోట్ల సినిమాతో సంచలనం.. ఎవరో తెలుసా?

Tollywood: మహేష్‌తో సహా 12 మంది స్టార్స్ రిజెక్ట్ చేశారు.. చివరకు ఆ హీరో బ్లాక్ బస్టర్ కొట్టాడు.. ఏ మూవీనో తెలుసా?

OTT Movie: 8 కోట్లతో తీస్తే 83 కోట్లు.. IMDbలో 8.6 రేటింగ్‌.. ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్