AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్ అరాచకం.. దైర్యం ఉన్నోళ్లే చూడాల్సిన సినిమా మావ.. మనుషుల శరీరంలో దూరే వింత జీవి..

హారర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. చాలా మంది భయపెట్టె దెయ్యాల సినిమాలు చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎలాంటి హారర్ సినిమాలు వచ్చిన వదిలిపెట్టకుండా చూస్తుంటారు. మరికొంతమంది భయమేసిన కళ్లు మూసుకుంటునైనా సినిమాను చూస్తూ ఉంటారు. ఓటీటీలో భయపెట్టే సినిమాలు చాలానే ఉన్నాయి.

బాబోయ్ అరాచకం.. దైర్యం ఉన్నోళ్లే చూడాల్సిన సినిమా మావ.. మనుషుల శరీరంలో దూరే వింత జీవి..
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Jun 03, 2025 | 4:34 PM

Share

ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత పేక్షకులను డబుల్ ఎంటర్టైమెంట్ దొరుకుతుంది. థియేటర్స్ లో కొత్త సినిమాలను ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులు ఓటీటీల్లోనూ సినిమాలు చూస్తూ మెప్పిస్తున్నారు. మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్, ఆసక్తిని రేకెతెత్తించే వెబ్ సిరీస్ నిత్యం సినీప్రియులను ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా హారర్ జోనర్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఓటీటీల్లో హారర్ సినిమాలు చూసేవారి సంఖ్య కూడా ఎక్కువే. అందులోనూ దెయ్యం కాన్సెప్ట్‌తో వచ్చే స్టోరీలు అయితే.. మూవీ లవర్స్ తెగ ఎంజాయ్ చేస్తారు. అలాగే ఏలియన్ సినిమాలకు కూడా ఓటీటీల్లో మంచి క్రేజ్ ఉంటుంది. తాజాగా ఓ సినిమా ఓటీటీని ఊపేస్తోంది. ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలు, భయపెట్టే అంశాలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. ఈ సినిమాలో ప్రతి సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి.

ఈ సినిమాలో ఓ వింత జంతువు మనుషుల శరీరంలో దూరం ప్రాణాలు తీస్తుంది.  ఈ సినిమాలో అమెరికాకు చెందిన నలుగురు స్నేహితులు విహారయాత్రకు వెళ్తారు. అయితే ఈ నలుగురు ఫ్రెండ్స్ కలిసి అర్కలజీ డిపార్ట్మెంట్ లో పని చేస్తూ తప్పిపోయిన ఓ వ్యక్తిని వెతుకుతూ వెళ్తారు. అయితే కొంతమంది గ్రామస్థులు వీరిని అడ్డుకుంటారు. అయితే అనుకోకుండా ఓ వింత జీవి వీరి శరీరంలోకి ఎక్కుతుంది. అది మనిషి మాంసాన్ని మొత్తం ఆరగిస్తుంది. ఈ క్రమంలోనే వారు చాలా గాయపడతారు. కొంతమంది ఆ జీవి వల్ల ప్రాణాలు కోల్పోతారు. ఇంకొంతమంది కాళ్లు, చేతులు పోగొట్టుకుంటారు.

చివరికి ఏం జరిగింది. ఆ జీవి నుంచి ఎవరెవరు తప్పించుకున్నారు. అసలు ఆ జీవి ఏంటి.? ఎక్కడి నుంచి వచ్చింది.? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.. ఈ సినిమా పేరు ది రూయిన్స్ . ఈ సినిమా 2008లో విడుదలైంది. ఈ హారర్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమా చూడాలంటే చాలా దైర్యం కావాలి. ఒంటరిగా ఈ సినిమా చూస్తే నైట్ నిద్రకూడా పోలేరు.. అనుక్షణం ఆ సీన్సు మిమ్మల్ని వెంటాడతాయి. ఈ సినిమా స్కాట్ బి. స్మిత్ రాసిన నవల ఆధారంగా రూపొందింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us