Bhanumathi missed Missamma: అలనాటి మేటి సినిమాల్లో ఒకటి మిస్సమ్మ. ఈ సినిమాలో ఎన్టీఆర్, ఎన్నార్, సావిత్రి, జమున, ఎస్వీఆర్ వంటి దిగ్గజ నటులు నటించారు. అయితే వీరందరికంటే కొంచెం ఎక్కువ పేరును తెచ్చుకున్నారు టైటిల్ పాత్రలో నటించిన సావిత్రి.. అవును ఈ సినిమాతోనే సావిత్రికి అభినేత్రిగా మంచి పేరు వచ్చింది. ఆమె ఇక చిత్ర పరిశ్రమలో తిరిగి చూడ లేదు. అయితే ముందుగా అద్భుతమైన పూర్తినిడివి హాస్య చిత్రంగా తెరకెక్కిన మిసమ్మలో హీరోయిన్ గా ముందుగా భానుమతిని తీసుకున్నారు. ఆమెతో కొంత మేర షూటింగ్ కూడా జరిపారు.
ఓ నాలుగు రీళ్ల సినిమా తయారయింది. అయితే ఒకరోజు భానుమతి షూటింగుకు మద్యాహ్నం వచ్చారు. దీంతో చిత్ర నిర్మాత చక్రపాణి ఉగ్రుడైపోయారు. “వరలక్ష్మి వ్రతం కావడంచేత ఆలస్యంగా వస్తానని మేనేజరుకి వుత్తరమిచ్చి మీకు అందజెయ్యమన్నాను అని భానుమతి రీజన్ చెప్పారు. అయితే ఆలస్యానికి భానుమతి క్షమాపణ చెప్పమన్నారు చక్రపాణిగారు.. అయితే తాను తప్పు చేయలేదని.. క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదన్నారు. దీంతో చక్రపాణి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. భానుమతితో తీసిన నాలుగు రీళ్ళు ఆమె చూస్తుండగానే తగలబెట్టీశారు. అలా భానుమతి మిస్సమ్మ మిస్సయ్యారు. భానుమతి ఆ మిస్సైన సినిమా స్టిల్స్ చూడండి.
మిస్సమ్మ మూవీ యొతిష్ బెనర్జీ అనే బెంగాలి రచయిత యొక్క “మన్మొయీ గర్ల్స్ స్కూల్” అనే హాస్య రచన. దీనిని ఆధారంగా చక్రపాణి, పింగళి నాగేంద్రరావులు రచించారు. ఎల్వీ ప్రసాదు దర్శకత్వంలో రూపొందిచబడింది. సావిత్రి, ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, రేలంగి, అల్లు రామలింగయ్య మొదలైన వారి నటనతో సినిమా పూర్తి వినోదాత్మకంగా రూపొందింది. ఇప్పటికీ క్లాసికల్ మూవీల్లో ఒకటిగా నిలిచిపోయింది.
Also Read: అమ్మ ప్రేమకు మరో సాక్ష్యం.. తన పిల్లల క్షేమం కోసం తల్లి ఎలుగు తపన.. నెటిజన్లు ఫిదా..!