
పై ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడామె టాలీవుడ్ లో బాగా ఫేమస్. హీరోయిన్ గా చేయకపోయినా తన అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎక్కువగా స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్స్ కు అక్కగా, చెల్లిగా నటిస్తోందీ ముద్దుగుమ్మ. ఇప్పటివరకు దాదాపు 25 కు పైగా సినిమాల్లో నటించిన ఈ నటి సొంతూరు తెలంగాణలోని నిజమాబాద్. బీఎస్సీ పూర్తి చేసి మొదట స్థానికంగా ఉండే ఓ లోకల్ న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత హైదరాబాద్ విచ్చేసి ప్రముఖ న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా విధులు నిర్వర్తించింది. అక్కడ పనిచేస్తున్నప్పుడే సినిమా వాళ్లతో పరిచయాలు పెంచుకుంది. సినిమా ఆడిషన్స్ కు వెళ్లింది. అలా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాలో అవకాశం దక్కించుకుంది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ మూవీలో సాయి పల్లవి అక్కగా అద్భుతంగా నటించింది. సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. తన నటనా ప్రతిభకు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారానికి కూడా నామినేట్ అయ్యింది. ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలు, హీరోయిన్లకు అక్కగా, చెల్లిగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటిస్తూ బిజి బిజీగా ఉంటోన్న ఆమె ఎవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది. యస్. తను శరణ్య ప్రదీప్.
శనివారం (మే17) శరణ్య ప్రదీప్ పుట్టిన రోజు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే సమయంలో శరణ్యకు సంబంధించిన అరుదైన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే.. గతేడాది మొత్తం నాలుగు సినిమాల్లో నటించింది శరణ్య ప్రదీప్. ముఖ్యంగా సుహాస్ నటించిన అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ మూవీలో శరణ్య నటనకు విమర్శకుల ప్రశంసల దక్కాయి. ఈ మూవీలో ఓ సీన్ లో అయితే ఆమె వివస్త్రగా నటించి పెద్ద సాహసమే చేసింది. దీంతో ఈ అమ్మడి అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. ఇక చివరిసారిగా ఆమె కిరణ్ అబ్బవరం క సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ అందాల తార చేతిలో పలు సినిమాలున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.