Tollywood: ‘ఆపద్బాంధవుడు’ సినిమాలోని హీరోయిన్ మీకు గుర్తిందా.. అయ్యబాబోయ్! ఇలా మారిపోయిందేంటి!

|

Feb 03, 2023 | 1:30 PM

విశ్వనాధ్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ 'ఆపద్బాంధవుడు'. ఈ మూవీలో హీరోగా మెగాస్టార్ చిరంజీవి అద్భుతమైన నటనతో ఆకట్టుకోగా.. మరోవైపు నటి మీనాక్షి చౌదరీ..

Tollywood: ఆపద్బాంధవుడు సినిమాలోని హీరోయిన్ మీకు గుర్తిందా.. అయ్యబాబోయ్! ఇలా మారిపోయిందేంటి!
Tollywood
Follow us on

కె. విశ్వనాధ్.. ఎన్నో కళాత్మక చిత్రాలకు సృష్టికర్త ఈయన. విశ్వనాథ్ కలం నుంచి రాలిన ఎన్నో అద్భుతమైన చిత్రాలు.. మరెన్నో పాత్రలు ప్రేక్షకుల మనసులలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. సప్తపది, స్వాతిముత్యం, సిరివెన్నెల, స్వయం కృషి, శుభోదయం, శుభలేఖ, అపద్భాంధవుడు లాంటి అద్భుతమైన చిత్రాలు తెలుగు అభిమానులకు అందించారు ఈ లెజండరీ డైరెక్టర్.

విశ్వనాధ్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ ‘ఆపద్బాంధవుడు’. ఈ మూవీలో హీరోగా మెగాస్టార్ చిరంజీవి అద్భుతమైన నటనతో ఆకట్టుకోగా.. మరోవైపు నటి మీనాక్షి చౌదరీ కూడా తెలుగుదనం ఉట్టిపడేలా అభిమానులను తన అందం, అభినయంతో అలరించింది. అలాగే డ్యాన్స్‌లతోనూ ఆకట్టుకుంది. భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సీలలో ఈ హీరోయిన్ ట్రైనింగ్ తీసుకున్న విషయం తెలిసిందే. 18 ఏళ్లకే ‘మిస్ ఇండియా’ టైటిల్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. తెలుగులో చేసిన మొదటి సినిమా ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’. ఆ సినిమాతో అంతగా ఫేం సంపాదించుకోలేకపోయిన మీనాక్షి.. తర్వాత నటించిన ‘ఆపద్బాంధవుడు’ మూవీతో అందరికీ చేరువైంది. బాలీవుడ్‌లోనూ దాదాపు 30కిపైగా చిత్రాల్లో నటించింది.

ఈమె 1995లో హరీష్ మైసూర్ అనే వ్యక్తిని పెళ్లాడి.. మొత్తంగా సినీ ఇండస్ట్రీకి దూరమైంది. వీరికి ఇద్దరు సంతానం. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి అమెరికాలో సెటిల్ అయిన ఈ బ్యూటీ.. అక్కడే టీచర్‌గా వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమె ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ తమకిష్టమైన హీరోయిన్‌ను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.