తెలుగు సినిమా స్థాయిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి దర్శకుడు రాజమౌళి. బాహుబలి సిరీస్ రూపంలో ఆయన విజువల్ వండర్ క్రియేట్ చేశారు. జక్కన్న మ్యాజిక్‌కి సినీ అభిమానగణం ఫిదా అయ్యింది. ఎన్నో అవార్డులు, రివార్డుల వరించాయి. ఆర్ఆర్ఆర్ సైతం అంతే రేంజ్‌లో సక్సెస్ అయ్యింది. ఈ అద్భుత విజయాలలో జక్కన్న దర్శకత్వం ప్రతిభ ఎంతటిదో ప్రపంచానికి తెలిసింది. ఇక రాజమౌళి సినిమాలకు కథలు అందించే.. ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్‌కు కూడా ఈ విజయాలలో ఎంతో కొంత షేర్ వెళ్తుంది. అయితే మన సినిమా స్థాయిని పెంచిన రాజమౌళికి అభినందలతో పాటు కొందరి నుంచి ట్రోల్స్ కూడా ఎదురవుతుంటాయి. ఆయన హాలివుడ్, కొరియన్ సినిమాలలోని సీన్లను మక్కీకి.. మక్కీ దించుతాడని విమర్శలు చేస్తూ ఉంటారు.
పాత తెలుగు సినిమాల నుంచి కూడా సీన్స్ తీసుకుని.. వాటిని యథావిథిగా రాజమౌళి తీస్తాడని ఆరోపణలు ఉన్నాయి. అందుకు ఉదాహారణగా.. రవితేజ – జక్కన్న కాంబినేషన్ లో వచ్చిన ‘‘విక్రమార్కుడు’’ సినిమాలోని పోలీసోడే కాదు.. పోలీసోడి యూనిఫామ్ కూడా డ్యూటీ చేస్తుందని అని నిరూపించే ఓ హై ఓల్డేజ్ సీన్ ఉంటుంది. ఆ సీన్ గతంలో విజయశాంతి నటించిన ‘‘శాంభవి ఐపీఎస్’’ సినిమా నుంచి కాపీ కొట్టారని.. సేమ్ టూ సేమ్ రాజమౌళి దించేశాడని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తుంటారు.
ఈ సీన్ గురించి రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ను డైరెక్ట్‌గా ఓ ఇంటర్య్యూలో ప్రశ్నించాడు ఓ సీనియర్ జర్నలిస్ట్. దానికి సూటిగా సమాధానం ఇచ్చారు విజయేంద్రప్రసాద్. ‘‘శాంభవి ఐపీఎస్’’ సినిమా కథ కూడా తానే రాసినట్లు తెలిపారు. ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో.. ప్రొడ్యూసర్‌తో మాట్లాడి ఆ సీన్‌ను విక్రమార్కుడు కోసం వినియోగించుకున్నట్లు వివరించారు. ఈ విషయంపై గతంలో రాజమౌళి సైతం స్పష్టత ఇచ్చారు.. “నేను ఇంతకు ముందు ఇతర సినిమాలు/నవలల నుండి కాపీ చేసాను, కానీ విక్రమార్కుడు నుండి బుల్లెట్ సన్నివేశం మాత్రం కాపీ కాదు. ఇది మా నాన్న చాలా కాలం క్రితం రాశారు” అని ట్వీట్ చేశారు.
(1)I’ve copied from other films/novels before, but not the bullets scene frm Vikramarkudu. That was written by my father long back. I don’t
— rajamouli ss (@ssrajamouli) August 28, 2014
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..