Nayanthara: చిరంజీవి సినిమా కోసం రెమ్యునరేషన్ తగ్గించుకున్న నయన్.. మరీ అంత తక్కువా..!!

ఎంటర్‌టైన్‌మెంట్, చరిష్మాతో ప్రేక్షకులను అలరించేందుకు మెగాస్టార్ చిరంజీవి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటిస్తున్న #మెగా157 బ్లాక్‌బస్టర్ మేకర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోంది. వరుస విజయాలు అందించిన అనిల్ రావిపూడికి ఇది చిరంజీవితో తొలి చిత్రం కావడం విశేషం. చిరంజీవి అభిమానులు ఎప్పటి నుంచో ఆయనను మళ్లీ పూర్తి స్థాయి హ్యూమరస్ క్యారెక్టర్ లో చూడాలనుకుంటున్నారు.

Nayanthara: చిరంజీవి సినిమా కోసం రెమ్యునరేషన్ తగ్గించుకున్న నయన్.. మరీ అంత తక్కువా..!!
Mega 157, Nayanthara

Updated on: May 26, 2025 | 12:53 PM

మెగాస్టార్ చిరంజీవి కోసం ఆయన అభిమానులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. బాస్ హిట్ కొడితే చూడాలని మెగా ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిటింగ్ ఇప్పుడు ఆ తరుణం రానే వచ్చింది అనిపిస్తుంది. వాల్తేరు వీరయ్య లాంటి కమర్షియల్ హిట్ తర్వాత బోళాశంకర్ అనే సినిమా చేశారు చిరు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కాస్తో బింబిసార దర్శకుడు వశిష్టతో సినిమా చేస్తున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరిలాంటి ఫాంటసీ కథతో సినిమాను తెరకెక్కిస్తున్నాడు యంగ్ డైరెక్టర్ వశిష్ట.. ఈ సినిమాతో పాటే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కూడా ఓ సినిమా చేస్తున్నారు చిరు. ఇప్పటికే ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి.

ఇది కూడా చదవండి : అది దా సర్‌ప్రైజ్‌..! ఖలేజా మూవీ దిలావర్ సింగ్ భార్య గుర్తుందా.. ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

వెరీ రీసెంట్ గా సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టేశారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి తీసుకురువడానికి సన్నాహాలు చేస్తున్నాడు అనిల్. అంతే కాదు ఈ సినిమాను మెగాస్టార్ మాస్ కు తన మార్క్ కామెడీని జోడించి తెరకెక్కిస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతారను రంగంలోకి దింపాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. మామూలుగానే నయన్ ప్రమోషన్స్ అంటే ఆమడ దూరంలో ఉంటుంది. కానీ బాస్ సినిమా కోసం ఆన్ బోర్డ్ అనౌన్స్ మెంట్స్ నుంచే ప్రమోషన్స్ లోకి దిగింది.. ఇదంతా అనిల్ మాయే అంటున్నారు ప్రేక్షకులు.

ఇది కూడా చదవండి : 17 ఏళ్ల క్రితం తల్లిపాత్ర చేసింది.. ఇప్పుడు అందంతో కుర్రాళ్లను కవ్విస్తుంది..

ఇదిలా ఉంటే ఇప్పుడు నయన్ రెమ్యునరేషన్ గురించి ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి, మాములుగా నయన్ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా రెమ్యునరేషన్ పుచ్చుకుంటుంది. కానీ బాస్ సినిమా కోసం అమ్మడు కాస్త తగ్గిందని అంటున్నారు. కథ బాగా నచ్చడంతోపాటు తన డేట్స్  కూడా తక్కువే కేటాయించడంతో నయన్ మెగాస్టార్ 157 సినిమా కోసం కేవలం రూ. 6కోట్లు తీసుకుంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే టాపిక్ అంటూ ఇండస్ట్రీలో ఇటు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మిస్తున్నారు. అలాగే సంగీతం భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు.

ఇది కూడా చదవండి : సినిమా అట్టర్ ఫ్లాప్ అని నిర్మాత బోరున ఏడ్చేశాడు.. కట్ చేస్తా 400రోజులు ఆడి.. ఇండస్ట్రీని షేక్ చేసింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.