రీసెంట్ డేస్ లో చిన్న సినిమాగా వచ్చి మంచి హిట్ అందుకున్న సినిమా లవ్ టుడే . తమిళ్ లో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా లవ్ టుడే సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్ కు కనెక్ట్ అయ్యే కథతో తెరకెక్కిన లవ్ టు డే సినిమాతో హీరోగా దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశాడు ప్రదీప్ రంగనాథన్. దర్శకుడిగానే కాకుండా హీరోగానూ నటించి మెప్పించాడు. ఇక లవ్ టుడే సినిమాపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను తెగ పొగిడేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్‌కు కు బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ఓ స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడని తెలుస్తోంది.
ప్రదీప్ రంగనాథన్ కు బంపర్ ఛాన్స్ ఇచ్చింది ఎవరోకాదు సూపర్ స్టార్ రజినీకాంత్ అంది తెలుస్తోంది. కొత్త దర్శకులకు ఛాన్స్ ఇవ్వడం రజినీకాంత్ నేచర్. ఇప్పటికే ఆయన చాలా మంది యంగ్ డైరెక్టర్స్ కు ఛాన్స్ కు ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రదీప్ రంగనాథన్‌కు కూడా ఛాన్స్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది.
లవ్ టుడే సినిమా చూసిన సూపర్ స్టార్ ప్రదీప్ రంగనాథన్ ను ఇంటికి పిలిచి మరి అభినందించారు. ఈ క్రమంలోనే మంచి కథను రెడీ చేస్తే సినిమా తీద్దాం అని ఆఫర్ ఇచ్చారట. దాంతో ప్రదీప్ రంగనాథన్ ఆనందంలో తేలిపోతున్నాడని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సూపర్ స్టార్ జైలర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే లోకేష్ కానగరాజ్ తో కూడా రజినీకాంత్ సినిమా ఉంటుందని తెలుస్తోంది.
Pradeep, Rajinikanth