Prabhas: ప్రభాస్ సినిమానుంచి తప్పుకున్న హీరోయిన్.. కారణం ఇదేనా

|

Dec 20, 2022 | 9:49 AM

ఈ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ దర్శకుడు  ఓం రౌత్ డైరెక్షన్ లో ఆదిపురుష్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో డార్లింగ్ రాముడిగా అలరించనున్నాడు

Prabhas: ప్రభాస్ సినిమానుంచి తప్పుకున్న హీరోయిన్.. కారణం ఇదేనా
Hero Prabhas
Follow us on

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే. వీటిలో ముందుగా సలార్ సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు ప్రభాస్. ఈ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ దర్శకుడు  ఓం రౌత్ డైరెక్షన్ లో ఆదిపురుష్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో డార్లింగ్ రాముడిగా అలరించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా  నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. వీటితోపాటు నాగ్ అశ్విన్ భారీ ప్రాజెక్ట్ కే సినిమాను కూడా పట్టాలెక్కించేశాడు. అయితే మారుతి దర్శకత్వంలో కూడా ప్రభాస్ సినిమా చేస్తున్నా విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపిస్తారని టాక్. అలాగే ఈ సినిమా హారర్ నేపథ్యంలో ఉంటుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా ఏకంగా ముగ్గురు భామలు నటించనున్నారు.

ఇందులో ‘మాస్టర్’ బ్యూటీ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, ‘రాధే శ్యామ్’ బ్యూటీ రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారని తెలుస్తోంది. అయితే వీరిలో ఇప్పుడు ప్రభాస్ సినిమానుంచి నిధి అగర్వాల్ తప్పుకుందని టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ఆమె లుక్ టెస్ట్ చేయగా ఆమె ప్రభాస్ సినిమాలో పాత్రకు సెట్ కాలేదట.. దాంతో ఈ అమ్మడిని తప్పించారని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలిసియాల్సి ఉంది.

నిధి అగర్వాల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాలో అందంతో ఆకట్టుకుంది నిధి. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహరవీరమల్లు సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది నిధి.

ఇవి కూడా చదవండి