తమిళ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుసగా టాలీవుడ్ సినిమాలు లైనప్ చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వలో సినిమా చేస్తున్నాడు ధనుష్. ఈ సినిమాకు సార్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ధనుష్ మాస్టర్ గా కనిపించనున్నాడు. ఓ ఇంట్రెస్టింగ్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ధనుష్. ఒక భారీ పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా ఈ సినిమాను ప్లాన్ చేశారట శేఖర్ కమ్ముల. 1950 లో ఆంధ్రా, తమిళనాడు మధ్య ఉన్న సంబంధాల గురించి ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇందులో తమిళ నాడులో ఉండే తెలుగు యువకుడుగా ధనుష్ కనిపించనున్నాడట. వెంకీ అట్లూరి సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే శేఖర్ కమ్ముల సినిమా పట్టాలెక్కనుందట. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారట శేఖర్ కమ్ముల. సినిమా తర్వాత మరో టాలీవుడ్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది
ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాకు దర్శకత్వం వహించిన రాధా కృష్ణతో ధనుష్ సినిమా చేయనున్నాడట. రాధేశ్యామ్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది ఈ సినిమా. ఇక ఇప్పుడు ధనుష్ కు ఓ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చెప్పారట రాధా కృష్ణ. కథ నచ్చడంతో ఆయనకు ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.