AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhurandhar 2 : ‘ధురందర్’ డైరెక్టర్ నెక్ట్స్ సినిమా ఇదే! ఆ టాలీవుడ్ స్టార్ హీరోలతో భారీ మల్టీస్టారర్ మూవీ!

రణవీర్ సింగ్ హీరోగా నటించిన 'ధురందర్ 2: ది రివెంజ్' బాక్సాఫీస్‌ వద్ద అదరగొడుతోంది. ఈ చిత్రం హిందీలోనే కాకుండా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నూ భారీ కలెక్షన్లు రాబడుతోంది. దీంతో డైరెక్టర్ ఆదిత్య ధర్ పేరు మరోసారి మార్మోగుతోంది.

Dhurandhar 2 : 'ధురందర్' డైరెక్టర్ నెక్ట్స్ సినిమా ఇదే! ఆ టాలీవుడ్ స్టార్ హీరోలతో భారీ మల్టీస్టారర్ మూవీ!
Dhurandhar 2 Movie
Basha Shek
|

Updated on: Mar 23, 2026 | 6:57 AM

Share

ప్రస్తుతం దేశంలో ‘ధురంధర్ 2’ మేనియా గట్టిగానే నడుస్తోంది. ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్లుతోంది. మొదటి పార్ట్ కు మించి వసూళ్లు రాబడుతూ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. మార్చి 19న రిలీజైన ధురంధర్ ది రివేంజ్ కేవలం 3 రోజుల్లోనే రూ. 500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. దీంతో డైరెక్టర్ ఆదిత్య ధర్ పేరు మరోసారి మార్మోగుతోంది. ఉరి తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఇప్పుడు ధురందర్, ధురంధర్ రివేంజ్ లతో స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు. ఇప్పుడు ఇతని దర్శకత్వంలో నటించేందుకు స్టార్ హీరోలు తీసేందుకు సైతం క్యూలో ఉన్నారు. కాగా ధురంధర్ ఫ్రాంఛైజీలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. ఇందులో మూడో భాగం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ధురంధర్ ది రివేంజ్ లోనూ మూడో పార్ట్ పై ఎలాంటి హింట్ ఇవ్వలేదు. దీంతో ‘ధురంధర్’ దర్శకుడు ఆదిత్య ధర్.. తర్వాత ఏ సినిమా చేస్తాడు? ఎవరితో చేస్తాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.

కాగా కొన్నాళ్ల క్రితం ‘అశ్వద్ధామ’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ఓ ప్రకటన చేశాడు ఆదిత్య ధర్. ఇందుకోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఆదిత్య చర్చలు జరిపాడని ప్రచారం జరిగింది. అయితే దీని తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే ధురంధర్ 2 సినిమా ప్రీమియర్ చూసిన అల్లు అర్జున్ సినిమాని కొనియాడుతూ ట్వీట్ చేయడం, ఆదిత్య ధర్ ను ఆకాశానికెత్తేయడం చూస్తుంటే త్వరలో వీరిద్దరూ కలిసి పనిచేస్తారేమోనని సినిమా ఇండస్డ్రీలో బలమైన టాక్ వినిపిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులో బన్నీతో పాటు ఎన్టీఆర్ కూడా ఓ స్పెషల్ రోల్ చేస్తాడని రూమర్లు వస్తున్నాయి. ఒక వేళ ఇదే నిజమైతే బన్నీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగేనని చెప్పుకోవచ్చు. అలాగే మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

కాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆదిత్య ధర్ కాంబినేషన్ లోనూ ఓ క్రేజీ ప్రాజెక్టు రూపొందనుందని మరో రూమర్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే ప్రస్తుతానికి ఇవి కేవలం రూమర్లు మాత్రమే. వీటిలో నిజమెంతుందో తెలియడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చు.

ధురంధర్ 2 సినిమాపై అల్లు అర్జున్ రివ్యూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర