సుశాంత్ ఆత్మ‌హ‌త్య కేసు : విచారణకు హాజరైన ధర్మ ప్రొడక్షన్‌ సీఈఓ

బాలీవుడ్ హీరో సుశాంత్‌సింగ్ సూసైడ్ కేసులో కరణ్‌ జోహార్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్ ధర్మ ప్రొడక్షన్‌ సీఈఓ అపూర్వ మెహతా విచారణకు హాజరయ్యారు.

సుశాంత్ ఆత్మ‌హ‌త్య కేసు : విచారణకు హాజరైన ధర్మ ప్రొడక్షన్‌ సీఈఓ

Updated on: Jul 29, 2020 | 9:34 AM

Sushant Singh Rajput case: బాలీవుడ్ హీరో సుశాంత్‌సింగ్ సూసైడ్ కేసులో కరణ్‌ జోహార్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్ ధర్మ ప్రొడక్షన్‌ సీఈఓ అపూర్వ మెహతా విచారణకు హాజరయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ముంబైలోని అంబోలి పీఎస్ కు చేరుకున్న మెహతా తన స్టేట్మెంట్ ఇచ్చారు. సుశాంత్‌సింగ్‌ బాంద్రాలోని తన ఇంట్లో జూన్‌ 14న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే. జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌తో కలిసి నటించిన ‘డ్రైవ్ చిత్ర‌మే అతడి చ‌నిపోవ‌డానికి ముందు విడుదలైన చివరి చిత్రం. ధర్మ ప్రొడక్షన్‌ నిర్మించిన ఈ సినిమా గత నవంబర్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ఈ సినిమాకు సంబంధించి సుశాంత్ సింగ్ సైన్ చేసిన అగ్రిమెంట్ పేప‌ర్స్ కూడా అపుర్వ మెహతా పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు స‌మాచారం.

ఈ కేసుకు సంబంధించి వచ్చేవారం ద‌ర్శ‌క‌నిర్మాత‌ కరణ్‌ జోహార్‌ను కూడా పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తోంది. సుశాంత్ ఆత్మహత్య అనంతరం క‌ర‌ణ్ జోహార్ సోష‌ల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. కంగన రనౌత్‌తో పాటు పలువురు నటులు సైతం ఇండస్ట్రీలో నెపోటిజంపై ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు ఇప్పటివరకు బాలీవుడ్‌కు చెందిన 40 మందిని విచారించారు. నిర్మాత మహేష్‌ భట్‌ కూడా సోమ‌వారం విచారణకు హాజరయ్యారు.

 

Read More : తొమ్మిదో భ‌ర్త చేతిలో భార్య హ‌తం..విచార‌ణ‌లో విస్తుపోయే వాస్త‌వాలు