
హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు ధనుష్. నటుడిగా ధనుష్ ఎన్నో విజయాలను సాధించాడు. తమిళ్, తెలుగు బాషలతోపాటు హిందీలోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంటున్నారు. అలాగే హాలీవుడ్ మూవీలోనూ నటించారు. హాలీవుడ్ లో తెరకెక్కిన ది గ్రే మ్యాన్ సినిమాలో నటించారు ధనుష్. తెలుగులో రీసెంట్ గా సార్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ధనుష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉన్నారు. శేకర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా.. అలాగే తన స్వీయ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు ధనుష్. అలాగే తనకు అసురన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన వెట్రి మారన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు ధనుష్.
ధనుష్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు. ఇటీవలే ఈ దంపతులు విడిపోయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ధనుష్ కు చాలా మంది హీరోయిన్స్ తో ఎఫైర్ ఉందని కోలీవుడ్ లో టాక్ ఉంది. అందుకే తన భార్య దూరం అయ్యిందని కోలీవుడ్ లో టాక్ కూడా వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే సార్ మూవీ టైంలో సినిమాల్లోకి రాక ముందు తన ప్రేమ కథ గురించి తెలిపారు ధనుష్. ఇప్పుడు మరోసారి అది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పదవ తరగతిలో నేను బాగా చదివేవాడిని. క్లాస్ లో నేని ఫస్ట్. ఎప్పుడూ నేనే టాపర్ ని అని తెలిపారు. తాను ఇంటర్లో ఉన్నప్పుడు ఓ అమ్మాయి పరిచయం అయ్యింది. ఆ అమ్మాయి కారణంగా తన చదువంతా పాడైందని తెలిపారు ధనుష్.
అప్పటి వరకు ఫస్ట్ ను తాను అమ్మాయి కారణంగా చదువ్వుల్లో లాస్ట్ అయ్యానని తెలిపారు. ఎప్పుడు అమ్మాయితో ఫోన్లో చాటింగ్, మాట్లాడటం చేసి చదువును పక్కన పెట్టేశారట. ఎలాగోలా ఇంటర్ పూర్తి చేసి ఆతర్వాతిహా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారట ధనుష్.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..