
స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ స్టార్ హీరో. ధనుష్ చాలా వేగంగా సినిమాలు చేస్తుంటాడు. తెలుగు, తమిళ్, హిందీ బాషలతో పాటు హాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ప్రస్తుతం తెలుగులో సినిమా చేస్తున్నాడు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు కుబేర అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కుబేర సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు.
నటుడిగానే కాదు దర్శకుడిగానూ ధనుష్ దూసుకుపోతున్నారు. రీసెంట్ గా జాబిలమ్మ నీకు అంత కోపమా అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతకు ముందు రాయన్ సినిమా కూడా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ధనుష్ ప్రధాన పాత్ర చేశారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ధనుష్ తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో పాటు హాలీవుడ్ లోనూ నటిస్తున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా ధనుష్ తన అభిమాన హీరో ఎవరో తెలిపారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నటుడు ధనుష్ గతంలో టాలీవుడ్‌లో తనకు ఇష్టమైన నటుడి గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఓ షోలో పాల్గొన్న ధనుష్ యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ.. నాకు ఎవరింటే ఇష్టమో నేను చెబుతాను, కానీ ఇతర నటుల అభిమానులు నన్ను ద్వేషించనివ్వకండి.. నాకు టాలీవుడ్ సినిమా అంటే ఇష్టం, చాలా మంది హీరోలు నాకు ఇష్టం. నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎక్కువ ఇష్టం అని తెలిపారు ధనుష్. ధనుష్ రాబోయే చిత్రం ఇడ్లీ కడై షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి ధనుష్ దర్శకత్వం వహించి, నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయనతో పాటు నటి నిత్యా మీనన్, అరుణ్ విజయ్, రాజ్ కిరణ్ వంటి ప్రముఖులు నటిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.