Dhamaka Director: ‘క్షమించండి.. నేను కూడా బీసీనే’.. ఉప్పర కులుస్థులకు డైరెక్టర్ త్రినాథరావు సారీ

|

Dec 22, 2022 | 3:30 PM

కులం-వర్గం పేరుతో దూషణ సినిమా ఇండస్ట్రీకి శాపంగా మారుతోందా? సినిమాల్లోగానీ, ప్రీరీలిజ్‌ ఈవెంట్‌లోగానీ ఎవరైనా, ఏదైనా కులాన్ని దూషిస్తే , ఆ మూవీపై పరోక్ష ప్రభావం కనిపిస్తోందా..? మూవీ రిలీజ్‌, కలెక్షన్లపై కూడా ఎఫెక్ట్‌ పడుతోందా? సినీ ఇండస్ట్రీలో ఇలా ఎందుకు జరుగుతోంది..? తరచూ వివాదంలో చిక్కుకోవడానికి కారణమేంటి..?

Dhamaka Director: క్షమించండి.. నేను కూడా బీసీనే.. ఉప్పర కులుస్థులకు డైరెక్టర్ త్రినాథరావు సారీ
Director Trinadha Rao Nakkina
Follow us on

టాలీవుడ్‌..కోలివుడ్‌..బాలీవుడ్‌..ఏ ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఐనా..కొన్ని సినిమాలు రిలీజ్‌కి ముందు వివాదాస్పదంగా మారుతున్నాయి. పలు మూవీస్‌లో ఏదో కులాన్ని దూషించడమో, లేదో కించపర్చడమో జరగడం..ఆ తర్వాత వివాదంతో సినిమా కాస్తా పబ్లిసిటీగా మారడం కామనైపోయింది. ఐతే చిత్ర బృందం ఈ వివాదం పొరపాటున చేస్తోందా..? లేక పబ్లిసిటీ కోసమా అనేది ఇప్పుడు ఫిల్మ్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది.  టాలీవుడ్‌ సినిమాల తరచూ ఇలాంటి వివాదాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా ధమాకా మూవీ డైరెక్టర్‌ త్రినాథరావు ఆ సినిమా ప్రీరీలిజ్‌ మూవీలో ఉప్పర కులస్థులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వైరల్‌గా మారింది.

ఈ వివాదంపై తెలంగాణ రాష్ట్ర ఉప్పర సంఘం నేతలు ఫైరయ్యారు. ఫిలీం ఛాంబర్‌ ఎదుట ఆందోళనకు దిగారు. డైరెక్టర్‌ త్రినాథరావు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.  దాంతో ధమాకా చిత్రబృందం దిగొచ్చింది. డైరెక్టర్‌ త్రినాథరావు సారీ చెప్పారు. తాను ఓ బీసీనే అంటూ, ఈ పదం ఇకపై రాజకీయ, సినీనటులు, ఇతరులు కూడా ఎవరు వాడొద్దని చెప్పారు. తాను బీసీనే..ఉప్పర సోదరులు కూడా బీసీలో భాగమే అన్నారు. సినిమా ప్రేక్షకుల్లో వారు భాగమే అని పేర్కొన్నారు, తనపై ఉన్న కోపాన్ని సినిమాపై చూపొద్దన్నారాయన.

గతంలోనూ అనేక సినిమాల్లో కులాలను కించపరుస్తూ అనేక పదాలు వాడటంతో వివాదాస్పదం అయ్యాయి. బాహుబలి సినిమా రిలీజ్‌కు ముందు ఆ సినిమాలో మాల కమ్యూనిటీని తప్పుగా చూపించారని కంప్లయింట్స్‌ వచ్చాయి. దానిపై ఆందోళనలు కూడా కొనసాగాయి. ఐతే మూవీ రిలీజ్ తర్వాత ఎలాంటి ఇబ్బంది రాకుండా చూశారు చిత్రబృందం. అలాగే రంగస్థలం సినిమా పాటలోనూ గొల్లభామ పదంపై ఆ కమ్యూనిటీ నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఇక మంచువిష్ణు నటించిన దేనికైనా రెడీ సినిమాలో బ్రహ్మాణులను అవమానించారని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. మూవీ రిలీజ్‌ తర్వాత ఆ సమస్యలు సద్దుమణిగాయి. అల్లు అర్జున్‌ నటించిన డీజే మూవీలో పైన అమ్మవారు..కింద కమ్మవారు అనే డైలాగ్‌ కూడా అప్పట్లో వైరలైంది. లేటెస్ట్‌గా నితిన్‌ నటించిన మాచర్ల నియోజకవర్గం మూవీ డైరెక్టర్‌ కమ్మ, కాపులపై మూడేళ్ల కిందట చేసిన ట్వీట్  సినిమా రిలీజ్‌ టైమ్‌లో ఇష్యూ అయ్యింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.