
ప్రస్తుతం ఎక్కడ విన్నా ఊ అంటావా.. ఊహు అంటావా మావ సాంగ్ మేనియా సాగుతోంది. సోషల్ మీడియాలో ఈ సాంగ్ ట్రెండ్ అవుతోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఈ పాటను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సమంత నటించిన ఈ స్పెషల్ ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబోస్ రచించిన ఈ పాటను తనదైన నిశా వాయిస్‌తో పాడి ఆకట్టుకుంది ఫోక్ సింగర్ ఇంద్రావతి చౌహన్. మత్తు వాయిస్‌కు టాప్ హీరోయిన్ సమంత స్టెప్పులు.. ఎక్స్‌ప్రెషన్స్‌తో ఈ పాటను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. అయితే ఈపాట లిరిక్స్ పై పురుషుల సంఘం ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఈ సాంగ్ బ్యాన్ చేయాలంటూ కోర్టులను కూడా ఆశ్రయించాయి.
ఇక.. మీ మగ బుద్దే వంకర బుద్ది అంటూ సాగే లిరిక్స్‌కు ధీటుగా ఊ అంటావా పాప.. ఊహు అంటావా పాప అంటూ పేరడీ సాంగ్ కూడా నెట్టింట్లో హంగామా చేసింది. ఎన్ని వివాదాలు నెలకొన్న ఊ అంటావా మావ.. ఊహు అంటావా సాంగ్ మేనియా మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ పాటను ఓ చిన్నారి తన గొంతుతో పాడి ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తన తల్లి who హు అని చెబుతుండగా.. ఊ అంటావా మావ.. ఊహు అంటావా మావ అంటూ పాడుతూ ఆకట్టుకుంది ఆ చిన్నారి.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ వరకు చేరింది. దీంతో తన ట్వట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. దట్స్ డామిన్ క్యూటీ.. థ్యాంక్యూ సో మచ్ భవనమర్ గారు అంటూ రిప్లై ఇచ్చాడు దేవి శ్రీ ప్రసాద్.
ట్వీట్..
Thats daaamn Cuteee !! ?
Thaanku so much @bhavanamar garu ! ??? https://t.co/F8fyxLwqKA
— DEVI SRI PRASAD (@ThisIsDSP) December 27, 2021
Singer Mangli: మంగ్లీకి సెల్పీల సెగ.. ఎగబడిన జనం.. ఆగ్రహం వ్యక్తం చేసిన సింగర్…