
దేవర చిత్రంలో సమర పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు సుదేవ్ నాయర్. మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో విలన్ పాత్ర పోషించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితం, సెట్‌లో తన అనుభవాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ వంటి సహనటులపై ఆయన ప్రశంసలు కురిపించారు. సుదేవ్ నాయర్ బాంబేలో జన్మించినప్పటికీ, త్రివేండ్రంలో పెరిగారు. ఆయన తల్లిదండ్రులు ఇప్పటికీ బాంబేలోనే నివసిస్తున్నారు. సుదేవ్ పూర్తి మలయాళీ. ఆయనకు త్రివేండ్రంలో ఒక సర్ఫ్ స్కూల్ ,రిసార్ట్ ఉంది, దాని నిర్వహణను ఆయన భార్య చూసుకుంటారు. తన కుటుంబంలో తన తల్లికి గోధుమ రంగు కళ్ళు ఉన్నాయని, అయితే తనకు మాత్రం హేజెల్ గ్రీన్ కళ్ళు ఉన్నాయని, ఇవి జనెటిక్స్ అని ఆయన వివరించారు. ఈ ప్రత్యేకమైన కళ్ళు తనను కొన్నిసార్లు భయపెడతాయని, మరికొన్నిసార్లు ఆకర్షిస్తాయని అన్నారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్‌గా త్రిష.. వీడియోస్ ఇదిగో..
జూనియర్ ఎన్టీఆర్ ప్రొఫెషనలిజంపై సుదేవ్ నాయర్ ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ అత్యంత సంక్లిష్టమైన యాక్షన్ సన్నివేశాలను కూడా ఒకే టేక్‌లో పూర్తి చేస్తారని, డూప్‌లు లేకుండానే అద్భుతంగా చేస్తారని వివరించారు. “మేము రిహార్సల్ చేస్తాం, ఆ తర్వాత ఎన్టీఆర్ వచ్చి కొరియోగ్రఫీని చూసి, ఓకే, డన్, టేక్ అంటారు. రిహార్సల్స్ లేకుండానే ఆయన చేస్తారు,” అని చెప్పారు. ఫారెస్ట్ ఫైట్ సీక్వెన్స్‌లో ఒక కష్టమైన సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు. “నాకు ఒక సీన్‌లో దూకి, ఎన్టీఆర్ పైకి వెళ్లేటప్పుడు ఆయనను కత్తితో నరకాలి. ఆయన దూకి తప్పించుకోవాలి. మాస్టర్ నాకు వెనుకకు దూకమని చెప్పినప్పుడు, ఎన్టీఆర్ టైమింగ్ కొంచెం భిన్నంగా ఉంటుందని చెప్పాను. నేను దూకడానికి ఎక్కువ సమయం తీసుకుంటాను కాబట్టి, ఆయన త్వరగా దూకితే నన్ను కొట్టే అవకాశం ఉంది. అందుకు ఆయన మీరు చింతించకండి సార్, నేను చూసుకుంటాను అని అన్నారు. రిహార్సల్ సమయంలో ఒకసారి తప్పు జరిగి, ఆయన పడిపోయారు. అప్పుడు నేను చాలా భయపడ్డాను, కానీ టేక్‌లో ఆయన అద్భుతంగా నిర్వహించారు.” అని వివరించారు. ఎన్టీఆర్ సెట్‌లో చాలా ఫోకస్‌డ్‌గా ఉంటారని, జిమ్‌లో మాత్రం క్యాజువల్‌గా, రిలాక్స్‌డ్‌గా ఉంటారని తెలిపారు. ఆయన చాలా స్నేహపూర్వకంగా, సులువుగా కలిసే వ్యక్తి అని సుదేవ్ నాయర్ పేర్కొన్నారు.
ఎక్కువమంది చదివినవి : RRR Movie : అబ్బబ్బా.. ఏం మారింది భయ్యా.. ఆర్ఆర్ఆర్ సినిమా మల్లీని చూశారా.. ? అచ్చం హీరోయిన్‌లాగే ఉందిగా..
ప్రస్తుతం సుదేవ్ నాయర్ మలయాళంలోనూ, కన్నడలోనూ బిజీగా ఉన్నారు. కన్నడలో యశ్ సరసన టాక్సిక్ చిత్రంలో నటిస్తున్నానని వెల్లడించారు. తన కెరీర్‌లో వస్తున్న ఈ పరిణామాలపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సుదేవ్ నాయర్ తన ప్రతిభతో, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఉదయ్ కిరణ్‌తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్.. ఎంతో నరకం అనుభవించాను.. టాలీవుడ్ హీరోయిన్..
Jr.ntr
ఎక్కువమంది చదివినవి : Cinema: 5 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ మూవీ.. ఓటీటీలో గత్తరలేపుతుంది..