ఎన్నో సినిమాలలో బాల నటుడిగా అలరించి సిద్ధార్థ రాయ్ సినిమాతో హీరోగా మారి ప్రేక్షకులను అలరించాడు దీపక్ సరోజ్. ఆయన హీరోగా రొమాంటిక్ కల్ట్ లవ్ స్టోరీ జానర్ సినిమా ప్రారంభమైంది. శ్రీ లక్ష్మీనరసింహ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ సినిమా నేడు పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైంది. హరీష్ గదగాని దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంతో తన్నీరు హరిబాబు నిర్మాతగా మారుతున్నారు. దీక్షిక, అనైరా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో రఘుబాబు, హైపర్ ఆది, సత్య, యూట్యూబర్ పుంజు, యాదమ్మ రాజు, రచ్చ రవి వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ రోజు అతిరధ మహారధుల సమక్షంలో ఈ చిత్రాన్ని సినిమా ఆఫీసులో వైభవంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు వేణు ఊడుగుల, ప్రదీప్ మద్దాలి, కమిటీ కుర్రాళ్ళు ఫేమ్ యదు వంశీ , క ఫేమ్ సుజిత్- సందీప్, సందీప్ సరోజ్, భరత్ పెద్దగాని, ఉదయ్ శర్మ, వంశీ చాగంటి, హైపర్ ఆది, రచ్చ రవి హాజరయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం ఈ సినిమా స్క్రిప్ట్ ని ప్రదీప్ మద్దాల, యదువంశీ అందించగా వేణు ఉడుగుల క్లాప్ కొట్టారు. సుజిత్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా ఫస్ట్ షాట్ కి సందీప్ డైరెక్షన్ చేశారు.
పూజా కార్యక్రమాల అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ “అందరికి నమస్కారమండి, ఈ పూజా కార్యక్రమం కొచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. నా పేరు హరీష్ ఇది నా మొదటి సినిమా. కథ చెప్పగానే నిర్మాత వెంటనే మొదలుపెడదాం అన్నారు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటా. ఈ కథ ఒప్పుకున్నందుకు మా హీరో దీపక్ , హీరోయిన్ అనైరా ఇద్దరికీ థాంక్స్ చెబుతున్నాను. ఇక్కడికి వచ్చిన గెస్టులు వేణు గారికి, వంశీ గారికి, సందీప్ సుజిత్ గార్లకు, ప్రదీప్ గారికి చాలా థాంక్స్. ఇది కంప్లీట్ లవ్ జానర్ సినిమా. రొమాంటిక్ కాల్ టు లవ్ స్టోరీ గా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. జనవరిలో మొదలుపెట్టి ఏప్రిల్ లో ముగించాలని ప్లాన్ చేస్తున్నాము. ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ చాలా థాంక్స్” ఉన్నారు.
హీరో దీపక్ సరోజ్ మాట్లాడుతూ ” గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం నాన్నోయ్ రైలు తెమ్మన్నాను తెచ్చావా? అన్న ఆ అబ్బాయిని నేనే. సిద్ధార్థ రాయ్ సినిమాకి మంచి రిసెప్షన్ ఇచ్చారు.. నా పేరు దీపక్ సరోజ్.నాన్న రైలు డైలాగు ఎప్పుడూ ఎందుకు చెబుతానంటే.. నేను ఆ డైలాగ్ ద్వారానే తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాను. ఈ సినిమా డైరెక్టర్ హరీష్ గారు ఒక మంచి ప్రేమ కథతో వస్తున్నారు. నేను మంచి కథ కోసం చూస్తున్నప్పుడు ఈ కథ విన్నాను నేను కచ్చితంగా చెప్పాల్సిన కథ అనిపించింది. టీం కూడా చాలా మంచి టీం అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ గారు ఇప్పటివరకు ఎంత మంచి సంగీతం ఇచ్చారో మనకు తెలుసు. ఆయన నా సినిమాకి సంగీతం అందించడం నా అదృష్టం. మా నిర్మాత హరిబాబు గారు ఇది మొదటి సినిమానే అయినా ఆయన చాలా కాలం ఇక్కడ ఉంటారని నాకు అనిపించింది. సినిమా కోసం ఏమైనా చేయడానికి సిద్ధమైన నిర్మాతలతో సినిమా చేయడం చాలా బాగుంటుంది. సినిమాటోగ్రాఫర్ సురేష్ గారు ఎడిటర్ వరప్రసాద్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే మంచి టీం సెట్ అయింది. ఈరోజు ఇక్కడికి వచ్చిన అతిథులకు మీడియా వారికి చాలా థాంక్స్. మా పిఆర్ఓ శివ గారికి ప్రత్యేక ధన్యవాదాలు” అన్నారు.
హీరోయిన్ అనైరా మాట్లాడుతూ అందరికీ నమస్కారం “ఈ ప్రాజెక్టులో భాగమైనందుకు నేను ఎంతో సంతోషంగా, ఒక రకంగా అదృష్టంగా భావిస్తున్నాను. మా దర్శక నిర్మాతలకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెబుతున్నాను. ఒక బయట వ్యక్తికి సినిమా అవకాశం రావడం మామూలు విషయం కాదు. కానీ వారు నాలో ఉన్న టాలెంట్ గుర్తించి నాకు అవకాశం కల్పించారు. ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి ఎందుకంటే కెమెరా ముందు కనపడటం అనేది నాకు చిరకాల కోరిక. చిన్నప్పటినుంచి నాకు కెమెరా అన్నా సినిమా అన్నా చాలా ఇష్టం. సినిమా అంటే నాకు ఒక రకమైన పిచ్చి, సినిమా అంటే పడి చచ్చిపోతాను నాకు సినిమా అంటే అంత ఇష్టం. దీపక్ గారితో కలిసి పనిచేయటానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. మేము మా బెస్ట్ టీంతో ఎంటర్టైనింగ్ ధమాకా ప్యాకేజ్ సినిమా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము” అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.