Tollywood: ఈ బుజ్జమ్మాయి.. ఇప్పుడు తెలుగులో మంచి నటి.. ఆమె కళ్లలోకి చూస్తే ప్రేమలో పడటం ఖాయం

నిజంగా ఈమె అందం ముందు హీరోయిన్స్ ఎవ్వరూ సరిపోరు. తెలుగింటి స్వచ్చమైన పల్లెటూరు అమ్మాయిలు ఎలా ఉంటారే ఈమె కూడా అలానే ఉంటుంది. నేచురల్ బ్యూటీ.

Tollywood: ఈ బుజ్జమ్మాయి.. ఇప్పుడు తెలుగులో మంచి నటి.. ఆమె కళ్లలోకి చూస్తే ప్రేమలో పడటం ఖాయం
Actress Childhood Photo

Updated on: Feb 05, 2023 | 6:52 PM

ఈ మధ్య ఫిల్మ్ సెలబ్రిటీల చిన్నప్పటి ముద్దు ముద్దు క్యూట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఏదైనా అకేషన్స్ ఉంటే చాలు వాటిని నెట్టింట వైరల్ చేసేస్తున్నారు ఫ్యాన్స్. తమ అభిమానాన్ని కామెంట్స్, క్యాప్షన్స్ రూపంలో చూపిస్తున్నారు. అలానే పైన ఉన్న ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్కూటర్‌పై కూర్చుని.. ముద్దుగా ఫోజ్ ఇస్తున్న ఈ చిట్టి తల్లి.. ఇప్పుడు తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో విభిన్న పాత్రలతో సత్తా చాటుతుంది. సమ్మోహనపరిచే అందంతో.. కుర్రాళ్ల మనసు దోచేస్తుంది. తను ఎవరో కనీసం గెస్ చేయగలరా..? చాలా కష్టం లేండి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో.. వెంకటేష్, మహేశ్ బాబు సోదరిగా నటించిన అభినయ చిన్నప్పటి ఫోటో ఇది.

పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన “నేనింతే” అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ అమ్మాయి. అభినయ పుట్టికతోనే మూగ, చెవుడు. అయినప్పటికీ నటి కావాలన్న తన  కోరికను ధృడ సంకల్పంతో నెరవేర్చుకుంది. తండ్రి కూడా నటుడే అవడం ఆమెకు కొంతమేర కలిసివచ్చింది. తమిళంలో ప్రముఖ డైరెక్టర్ సముద్ర ఖని దర్శకత్వం వహించిన “నాడోడిగళ్”  చిత్రం ద్వారా అభినయ కెమెరా ముందుకు వచ్చింది. డైలాగులు చెప్పలేక పోయినప్పటికీ..  ఎమోషన్‌కు తగినట్లుగా తన హావ భావాలను పలికిస్తూ మేకర్స్‌ని ఆశ్చర్యపరిచేది అభినయ. అలా ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి.

తెలుగు, తమిళ్, మలయాళం కన్నడ.. ఇలా దక్షిణాదిన అన్ని సినిమాల్లో నటించింది అభినయ. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం సీతారామం. నటన మాత్రమే కాదు ముట్టుకుంటే మాసిపోతుందా అన్నంత అందంగా ఉంటుంది ఆమె. అభినయ మున్మందు మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుందాం.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.