
ఫస్ట్ ఫిల్మ్ ఈశ్వర్ తోనే.. టాలీవుడ్‌లో ఉన్న హ్యాండసమ్ హీరోల్లో చేరిపోయిన ప్రభాస్.. ఈ సినిమా తరువాత నుంచి టీనేజ్ అమ్మాయిల క్రష్‌గా మారిపోయారు. తన మేచో లుక్స్‌తో.. హంక్ పర్సనాలిటీతో.. వారి గుండెల్లో తిష్టవేశారు. ప్రభాస్ అంటే వెర్రెక్కిపోయేవారు అమ్మాయిలు. ఆల్మోస్ట్ యూత్ అందర్నీ తన ఫాలోవర్స్‌గా మార్చుకున్నారు. డార్లింగ్, మిస్టర్ ఫర్‌ఫెక్ట్, మిర్చి సినిమాల్లో ప్రభాస్ లుక్ అల్టిమేట్ ఉంటుంది. కానీ బాహుబలి సినిమాతో బాలీవుడ్ లో కూడా తన ప్రతాపం చూపించి.. అక్కడి జనాలను కూడా తన లుక్స్‌తో ఫిదా అయ్యేలా చేశారు ప్రభ. బాలీవుడ్ లోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు.
కానీ బాహుబలి2 తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ.. లుక్స్ విషయంలో మాత్రం ట్రోల్స్ ఎదుర్కొన్నారు ప్రభాస్. బాహుబలి కోసం ఎక్కువ వర్కువుట్స్ చేసి.. ట్రాన్స్‌ఫాం అవ్వడమో.. ఆ వెంటనే మళ్లీ సన్నగా అయ్యేందుకు ప్రయత్నించడమో.. తెలియదు కానీ.. ముందున్న ఛార్మింగ్ కోల్పోయారనే టాక్ వచ్చింది బాలీవుడ్‌లో అయితే పాపం విపరీతంగా ట్రోల్ అయ్యారు.
కానీ కట్ చేస్తే.. ఎట్ ప్రజెంట్ తన నయా లుక్స్‌తో ఫ్లాష్ అయ్యారు ప్రభాస్. స్లిమ్ లుక్‌లో.. మునపటి ఛార్మింగ్‌తో .. అదే స్టైల్ సింబల్‌తో అందర్నీ మెస్మరైజ్ చేస్తున్నారు. ప్రజంట్ యూత్ ప్రొఫైల్ పిక్చర్‌గా మారిపోతున్నారు ప్రభాస్. హ్యాండ్ సమ్‌నెస్ కే కేరాఫ్ అనే కామెంట్స్ వచ్చేలా చేసుకుంటున్నారు. నెట్టింట విపరీతంగా వైరల్ కూడా అవుతున్నారు. బాలీవుడ్ ట్రోలర్స్‌కైతే దిమ్మతిరిగేలా చేస్తున్నారు.
Darling’s uber cool look?#Prabhas pic.twitter.com/uhYcRSZYdy
— SIIMA (@siima) February 11, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.