Actress Pooja Gandhi: పెళ్లి పీటలెక్కనున్న దండు పాళ్యం సినిమా హీరోయిన్‌.. వరుడు ఎవరో తెలుసా?

ప్రముఖ కన్నడ నటి, దండు పాళ్యం మూవీ ఫేమ్‌ పూజా గాంధీ త్వరలో తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. ఎన్నో ఏళ్లుగా కన్నడ సినీ పరిశ్రమలో కొనసాగుతున్న ఆమె త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. బుధవారం (నవంబర్‌ 29)న ఒక ప్రముఖ వ్యాపార వేత్తను పూజా వివాహం చేసుకోనుందని తెలుస్తోంది. ఇందుకోసం బెంగుళూరులోని యలహంకలో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Actress Pooja Gandhi: పెళ్లి పీటలెక్కనున్న దండు పాళ్యం సినిమా హీరోయిన్‌.. వరుడు ఎవరో తెలుసా?
Pooja Gandhi

Updated on: Nov 28, 2023 | 8:36 AM

ప్రముఖ కన్నడ నటి, దండు పాళ్యం మూవీ ఫేమ్‌ పూజా గాంధీ త్వరలో తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. ఎన్నో ఏళ్లుగా కన్నడ సినీ పరిశ్రమలో కొనసాగుతున్న ఆమె త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. బుధవారం (నవంబర్‌ 29)న ఒక ప్రముఖ వ్యాపార వేత్తను పూజా వివాహం చేసుకోనుందని తెలుస్తోంది. ఇందుకోసం బెంగుళూరులోని యలహంకలో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బెంగళూరులో లాజిస్టిక్స్ కంపెనీని కలిగి ఉన్న విజయ్‌తో పూజా ప్రేమలో ఉన్నారని, ఇప్పుడు అతని తోనే తన వైవాహిక జీవితాన్ని ప్రారంభించనుంది. నటి పూజా గాంధీ స్వస్థలం ఉత్తరప్రదేశ్. ఆమె మాతృభాష హిందీ. కానీ కన్నడ చిత్ర పరిశ్రమలోనే స్థిరపడింది. పూజకు విజయ్‌నే కన్నడ నేర్పించాడట. ఆ తర్వాతనే ఆమె సినిమాల్లో నటించినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య పరిచయం వల్లే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారని శాండల్‌వుడ్‌ లో టాక్‌ వినిపిస్తోంది. అయితే తన పెళ్లిపై అటు పూజా గాంధీ కానీ ఆమె కుటుంబ సభ్యులు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. 2012లోనే పారిశ్రామికవేత్త ఆనంద్ గౌడతో పూజా గాంధీకి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. అయితే వివిధ కారణాలతో నిశ్చితార్థం జరిగిన నెల రోజులకే వీరిద్దరూ విడిపోయారు.

కన్నడ చిత్ర పరిశ్రమలో పూజా గాంధీ నటించిన తొలి చిత్రం ‘ముంగారు వర్మ’ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. గణేష్‌తో కలిసి కనిపించిన పూజా గాంధీ రాత్రికి రాత్రే స్టార్ నటి అయిపోయింది. ఆ తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. పునీత్ రాజ్ కుమార్ వంటి స్టార్ ఆర్టిస్టులతో నటించి మరింత పాపులర్ అయ్యింది. కన్నడతో పాటు తమిళ, బెంగాళీ, హిందీ, తెలుగు సినిమాల్లో నటించిందీ అందాల తార. ఇక దండుపాళ్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఇందులో బోల్డ్‌ క్యారెక్టర్‌లో నటించి మెప్పించింది. దండుపాళ్యం సిరీస్‌లోని మూడు సినిమాల్లోనూ పూజా గాంధీనే మెయిన్‌ రోల్‌ పోషించడం విశేషం.

ఇవి కూడా చదవండి

పూజా గాంధీ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

అవార్డుల ప్రదానోత్సవంలో నటి పూజ..

పూజా గాంధీ గ్లామరస్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.