అతని ఎపిసోడ్ వల్ల చాలా హర్ట్ అయ్యా.. ఇప్పటికీ బాధగా ఉందంటున్న దమ్ము శ్రీజ

బిగ్ బాస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో దమ్ము శ్రీజ ఒకరు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్నానికి చెందిన ఆమె సాప్ట్ వేర్ జాబ్ ను వదిలిపెట్టి మరీ బిగ్ బాస్ లోకి వచ్చింది. మొదట అగ్నిపరీక్షలో సత్తా చాటిన ఆమె కామనర్స్ కోటాలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తన ఆట, మాట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది.

అతని ఎపిసోడ్ వల్ల చాలా హర్ట్ అయ్యా.. ఇప్పటికీ బాధగా ఉందంటున్న దమ్ము శ్రీజ
Dammu Srija

Updated on: Feb 24, 2026 | 7:06 PM

బిగ్ బాస్ హౌస్ లోకి కామనార్ గా ఎంట్రీ ఇచ్చింది దమ్ము శ్రీజ. బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. ఆతర్వాత బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ కంటెస్టెంట్ గా నేరుగా హౌస్‌లోకి అడుగు పెట్టింది. తన ఆట, మాట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది. మరీ ముఖ్యంగా తన ముక్కుసూటితనం మాటలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అదే క్రమంలో తన ఓవర్ యాటిట్యూడ్ తో నెగెటివిటీని మూటగట్టుకుంది. దీంతో బిగ్ బాస్ ఫినాలే దాకా ఉంటుందనుకున్న శ్రీజ ఐదో వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. ఈ ఎంట్రీ కూడా ఇచ్చింది.. కానీ మళ్లీ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది.  బిగ్ బాస్ తర్వాత బీబీ జోడీలో పాల్గొంటుంది ఈ అమ్మడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది శ్రీజ.

ఈ ఇంటర్వ్యూలో హైపర్ ఆది ఎపిసోడ్‌పై దాము శ్రీజ చేసిన వ్యాఖ్యలు, బిగ్ బాస్ హౌస్‌లో ఆమె అనుభవాలుపంచుకుంది. శ్రీజ మాట్లాడుతూ, ప్రతి బిగ్ బాస్ సీజన్‌లో ఒక హైలైట్ ఎపిసోడ్ ఉంటుంది. హైపర్ ఆది కామెడీ కోసం అందరూ ఎదురుచూస్తారు, ముఖ్యంగా దీపావళి ఎపిసోడ్‌ల కోసం. నేను బయట ఉండగా, ఆ ఎపిసోడ్ ఇలా వచ్చిందని, ఇలా మాట్లాడారని తెలిసినప్పుడు చాలా హర్ట్ అయ్యాను అని తెలిపింది. ఆ సంఘటన తనను డిప్రెషన్ స్థాయికి కాకుండా, ఒక రకమైన ట్రామాకు గురిచేసిందని ఆమె తెలిపింది. బిగ్ బాస్ తనకు ఎంతో ఇష్టమైనది కావడంతో, ఒక కామన్ వ్యక్తిగా తనకు వచ్చిన అవకాశాన్ని కోల్పోవడం పట్ల ఇప్పటికీ బాధ ఉందని పేర్కొంది. బిగ్ బాస్ హౌస్‌లో తన ఎలిమినేషన్ అన్యాయమైనదని తెలిపింది, ఆడియన్స్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని చెప్పుకొచ్చింది.

“నాదిఅన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని చాలామంది భావించారు. ఆడియన్స్ రీ-ఎంట్రీ, రీ-ఎంట్రీ అంటూనే ఉన్నారు. అంత మంది కోరుకుంటున్నప్పుడు వారి కోసమైనా వెళ్ళాలనిపించింది. బిగ్ బాస్ నాకు చాలా ఇష్టం కాబట్టి వెళ్ళా.” అని శ్రీజ తెలిపింది. అయితే, వైల్డ్ కార్డ్ రీ-ఎంట్రీ నిర్ణయం పట్ల తర్వాత పశ్చాత్తాపపడ్డానని తెలిపింది. నాకు బిగ్ బాస్ ముందు నుంచే పొగరు అనుకుంటారు. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక ఫేమ్ వచ్చింది కదా, మాతో మాట్లాడదు అని అనుకుంటారని తెలుసు.. కానీ తన స్నేహితులు ఎవరూ అలా అనుకోలేదని, తాను అందరితో బాగానే ఉంటానని చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ హౌస్‌లో తన నెగెటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుతూ, తాను సహజంగానే ఏదైనా సమస్య ఉంటే మాట్లాడే స్వభావం ఉందని. గట్టిగా మాట్లాడే అమ్మాయి అంటే ఎంత మోడ్రన్ ప్రపంచంలో ఉన్నా సరే అందరికీ నచ్చదు. అబ్బాయి గట్టిగా మాట్లాడితే ఆల్ఫా మేల్ అంటారు, అదే అమ్మాయి మాట్లాడితే గయ్యాళి అంటారు.” అని శ్రీజ పోల్చారు. మొదటి రెండు వారాలు ఏదైనా తప్పు జరిగితే, అది తనకు నెగెటివ్ అయినా సరే, ఇతరుల కోసం మాట్లాడేదాన్నని, దానివల్లే అరుస్తుంది, మధ్యలో దూరిపోతుంది అనే నెగెటివ్ వచ్చిందని.. తర్వాత అందరూ నెగెటివ్ వైబ్స్ చూస్తున్నారని తెలుసుకుని, నెమ్మదిగా తన స్వభావాన్ని తగ్గించుకున్నానని తెలిపింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us