Daggubati Abhiram: లంకలో ఘనంగా దగ్గుబాటి అభిరామ్, ప్రత్యూష వివాహం.. వైరలవుతున్న ఫోటోస్..

|

Dec 07, 2023 | 2:30 PM

దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కుమారుడు.. పాన్ ఇండియా హీరో రానా సోదరుడు దగ్గుబాటి అభిరామ్.. దగ్గరి బంధువు వరుసకు మరదలు అయిన ప్రత్యూషతో ఏడడుగులు నడిచారు. డిసెంబర్ 6న శ్రీలంకలో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‏కు ఇరు కుటుంబసభ్యులతోపాటు.. సన్నిహితులు హాజరయ్యారు. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దాదాపు మూడు రోజలపాటు వీరి పెళ్లి వేడుక జరిగినట్లుగా తెలుస్తోంది.

Daggubati Abhiram: లంకలో ఘనంగా దగ్గుబాటి అభిరామ్, ప్రత్యూష వివాహం.. వైరలవుతున్న ఫోటోస్..
Daggubati Abhiram
Follow us on

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోస్ బ్యాచిలర్ లైఫ్‏కు ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. ఇటీవలే మెగా హీరో వరుణ్ తేజ్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో హీరో ఓ ఇంటివాడయ్యాడు. దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కుమారుడు.. పాన్ ఇండియా హీరో రానా సోదరుడు దగ్గుబాటి అభిరామ్.. దగ్గరి బంధువు వరుసకు మరదలు అయిన ప్రత్యూషతో ఏడడుగులు నడిచారు. డిసెంబర్ 6న శ్రీలంకలో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‏కు ఇరు కుటుంబసభ్యులతోపాటు.. సన్నిహితులు హాజరయ్యారు. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దాదాపు మూడు రోజలపాటు వీరి పెళ్లి వేడుక జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక అభిరామ్ సతీమణి ప్రత్యూష స్వస్థలం కారంచేడు అని తెలుస్తోంది.

దగ్గుబాటి సురేష్ బాబుకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు రానా దగ్గుబాటి కాగా.. చిన్న కుమారుడు అభిరామ్ దగ్గుబాటి. లీడర్ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు రానా. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి హీరోగా ప్రశంసలు అందుకున్నారు. గతంలో డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించి బాహుబలి సినిమాలో భల్లాలదేవ పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించారు. ఇందులో పూర్తిగా విలనిజంతో అదరగొట్టేశారు. ఇక అభిరామ్ విషయానికి వస్తే.. ఇటీవలే అహింస సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. డైరెక్టర్ తేజ తెరకెక్కించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో తొలి సినిమానే బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాలు చేయనున్నట్లు తెలుస్తోంది.

శ్రీలంకలోని కలుతర పట్టణంలో అనంతర కలుతర రిసార్ట్స్ లో నిన్న రాత్రి 8.50 గంటలకు అభిరామ్ దగ్గుబాటి, ప్రత్యూష చాపరాల వివాహం ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. సముద్రం మధ్యలో ఉండే ఈ రిసార్ట్‏లో వీరి పెళ్లి జరిగింది. పెళ్లికూతురు ప్రత్యూష..అభిరామ్ చినతాత కూతురికి కూతురే కావడంతో వరుసకు మరదలు అవుతుంది. ఇటీవలే అభిరామ్ ప్రత్యూష నిశ్చితార్థం జరిగింది. అయితే ఈ విషయంపై మాత్రం బయటకు రాలేదు. హైదరాబాద్ లో మెహందీ, హల్దీ వేడుకలు నిర్వహించారని.. కేవలం పెళ్లితంతు మాత్రం శ్రీలంకోలని లగ్జరీ రిసార్ట్ లో జరిగినట్లు తెలుస్తోంది. వీరి పెళ్లికి దాదాపు 200 మంది అతిథులు హాజరయ్యారు. అలాగే వచ్చే ఏడాదిలో వెంకటేష్ చిన్న కూతురు హవ్య వాహిని వివాహం కూడా జరగనుంది. ఇటీవలే ఆమె నిశ్చితార్థం జరగ్గా.. మహేష్ బాబు, చిరంజీవి హాజరయ్యారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.