సింగర్‌ సునీత పేరుతో మోసం..వ్య‌క్తి అరెస్ట్‌

| Edited By: Pardhasaradhi Peri

Aug 08, 2020 | 4:59 PM

సామాజిక మాధ్య‌మాలు వేదికగా తన పేరును వాడుకుంటూ అమాయక ప్రజల్ని మోసం చేస్తున్న ఓ వ్యక్తిపై సింగ‌ర్ సునీత సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే.

సింగర్‌ సునీత పేరుతో మోసం..వ్య‌క్తి అరెస్ట్‌
Follow us on

Cheating on the Name of Singer Sunitha : సామాజిక మాధ్య‌మాలు వేదికగా తన పేరును వాడుకుంటూ అమాయక ప్రజల్ని మోసం చేస్తున్న ఓ వ్యక్తిపై సింగ‌ర్ సునీత సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచార‌ణ చేసిన‌ పోలీసులు అనంతపురానికి చెందిన చైతన్య అనే వ్యక్తిని శనివారం అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. చైతన్య అనే వ్యక్తి గాయ‌ని సునీత మేనళ్లుడినని చెప్పుకుంటూ సామాజిక మాధ్య‌మాల‌ వేదికగా డబ్బులు వసూలు చేస్తూ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నాడు. సునీత పేరుతో తాను సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు చాలామందిని డ‌బ్బు అడిగాడు. దీంతో సునీత పేరు చూసి ఆమెను అభిమానించేవారు భారీగా డబ్బులు ఇచ్చారు. ఈ విష‌యంపై గ‌త వారం ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడిన సునీత ..ఈ ఇష్యూపై స్ప‌దించారు. చైతన్య అనే అనే వ్యక్తి ఎవరో త‌న‌కు తెలియదని..త‌న‌ను అభిమానించేవాళ్లు ఆ మోస‌గాడి వలలో పడొద్దని సూచించారు. ఆ త‌ర్వాత అత‌డిపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చైతన్యను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

 

Read More : గుంటూరు జిల్లాలో పెళ్లైన 24 గంటల్లోపే నవ వధువు మరణం : కార‌ణం ?