Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారిపాట. సరిలేరు నీకెవ్వరు సినిమాతర్వాత మహేష్ బాబు నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మహేష్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే ఈ సర్కారు వారి పాట సినిమా నుంచి రీసెంట్ గా విడుదలైన ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన కళావతి పాటకు భారీ స్తాయిలో రెస్పాన్స్ వస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సింగర్ సిద్ శ్రీరామ్ మరియు లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ సమిష్టి కృషితో ఈ పాట రికార్డులు క్రియేట్ చేస్తుంది.
ళావతి సాంగ్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ వీడియోలో మహేష్, కీర్తి సురేష్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, మహేష్, డైరెక్టర్ పరశురామ్ ఫన్నీగా గడిపినట్టుగా తెలుస్తోంది. ఈ వీడియోకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే కళావతి సాంగ్ కు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ పాటకు అందరూ మహేష్ స్టెప్ ను వేస్తూ ఆ వీడియోలను షేర్ చేస్తున్నారు. తాజాగా ఓ చిన్నారి మహేష్ వేసిన అదే స్టెప్స్ వేసి అదరగొట్టింది. చాలా క్యూట్ గా ఆ చిన్నారి వేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
మరిన్ని ఇక్కడ చదవండి :