Vijay Deverakonda : సుకుమార్ సినిమాలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ అలా కనిపించబోతున్నాడా..?

టాలీవుడ్ క్రేజీ విజయ్ దేవరకొండ ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరీజగనాథ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పెళ్లిచూపులు సినిమా తో హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించాడు. ఆతర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించాడు.

Vijay Deverakonda : సుకుమార్ సినిమాలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ అలా కనిపించబోతున్నాడా..?

Updated on: Mar 06, 2021 | 9:28 AM

Vijay Deverakonda- sukumar movie : టాలీవుడ్ క్రేజీ విజయ్ దేవరకొండ ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరీజగనాథ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పెళ్లిచూపులు సినిమా తో హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించాడు. ఇక విజయ్  యాటిట్యూడ్, బాడీలాంగ్వేజ్ కి యువతలో మంచి క్రేజ్ ఉంది. ఇక వరుస సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు విజయ్ . పూరీ డైరెక్షన్ లో లైగర్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో రూపొందుతుంది. ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ కి అనన్య టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ టాప్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చాలా కాలం క్రితమే అనౌన్స్ చేశారు.

ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ తో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తో సినిమా ఉండనుంది. పుష్ప కంటే ముందే విజయ్ కు స్టోరీ లైన్ వినిపించాడట సుక్కు. తాజాగా ఈ సినిమానుంచి ఓ క్రేజీ అప్డేట్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది.  విజయ్ దేవరకొండతో యుద్ధం నేపథ్యంలో సాగే కథను తెరకెక్కించబోతున్నాడట. విజయ్ దేవరకొండ సైనికుడిగా కనిపించనున్నాడట. అంతే కాదు ఈ సినిమాలో అందమైన ప్రేమ కథ కూడా ఉంటుందని అంటున్నారు.  ఇదే విషయం పై గతంలోనూ వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి ఇదే వార్త ఫిలిం సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక లైగర్ సినిమా తర్వాత విజయ్ సఝివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

నటుడిగా ‘ప్రస్థానం’.. విభిన్న కథలే ‘గమ్యం’.. ప్రేక్షకాదరణకు ‘శ్రీకారం’.. హ్యాపీ బర్త్ డే యంగ్ హీరో శర్వానంద్

Sreekaram Trailer: భవిష్యత్ తరాలు బాగుండాలంటే ఇప్పుడు ఈ ‘శ్రీకారం’ చుట్టాల్సిందే.. రైతే రాజు