Radhika And Sarath Kumar: చెక్‌బౌన్స్ కేసు.. శరత్ కుమార్, రాధికలకు చుక్కెదురు.. ఏడాది జైలు శిక్ష..!

Radhika and Sarath Kumar: చెక్‌బౌన్స్ కేసులో నటులు శరత్ కుమార్, రాధికలకు చుక్కెదురు అయింది. ఈ కేసులో వారిద్దరికీ ఏడాది పాటు...

Radhika And Sarath Kumar: చెక్‌బౌన్స్ కేసు.. శరత్ కుమార్, రాధికలకు చుక్కెదురు.. ఏడాది జైలు శిక్ష..!
Radhik A

Updated on: Apr 07, 2021 | 2:08 PM

Radhika and Sarath Kumar: చెక్‌బౌన్స్ కేసులో నటులు శరత్ కుమార్, రాధికలకు చుక్కెదురు అయింది. ఈ కేసులో వారిద్దరికీ ఏడాది పాటు జైలు శిక్షను విధిస్తూ చెన్నై ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. 2015వ సంవత్సరంలో రాధిక, శరత్‌కుమార్ నిర్మాణ సంస్థ రేడియంట్ గ్రూప్ నుంచి రుణాలు తీసుకున్న విషయం తెలిసిందే.

సదరు సంస్థ రుణం తిరిగి ఇవ్వాలని శరత్ కుమార్, రాధికలపై ఒత్తిడి తేవడంతో వారు డబ్బును తిరిగి చెక్కు రూపంలో చెల్లించారు. ఇక ఆ చెక్ కాస్తా బౌన్స్ కావడంతో రేడియంట్ గ్రూప్ కోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘ విచారణల అనంతరం దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత చెన్నై స్పెషల్ కోర్టు రాధిక, శరత్ కుమార్‌లకు ఏడాది జైలు శిక్ష విధించింది.

Also Read:

‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌’.. దరఖాస్తు చేసుకోండిలా.. అర్హతలు ఇవే.!

ఈ ఫోటోలోని ఇద్దరు హీరోయిన్స్‌ను గుర్తు పట్టారా.? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్.!

ఇంటి గుమ్మంలో తిష్టవేసిన సింహాలు.. డోర్ తీసి కంగుతిన్న యజమాని.. కట్ చేస్తే ఊహించని సంఘటన.!